Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. తల్లీకూతురు మృతి
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:10 PM
ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన తల్లీకుమార్తె కూడా మృతిచెందారు. మృతులను శివ్వాయిపల్లికి చెందిన సంధ్యారాణి (43), చందన (23)గా పోలీసులు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 24: ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన తల్లీకుమార్తె కూడా మృతిచెందారు. మృతులను శివ్వాయిపల్లికి చెందిన సంధ్యారాణి (43), చందన (23)గా పోలీసులు వెల్లడించారు. కుమార్తె చందనను బెంగళూరులో డ్రాప్ చేసేందుకు సంధ్యారాణి వేమూరి కావేరి బస్సు ఎక్కింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో చందన ఉద్యోగం చేస్తోంది.
సంధ్యారాణి.. తన భర్త ఆనంద్‌కుమార్‌తో కలిసి మస్కట్‌లో ఉంటున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కుమార్తె చందన జాబ్ చేస్తున్నారు. అయితే పెళ్లి వేడుక కోసం సంధ్యారాణి దంపతులు గ్రామానికి వచ్చారు. బిజినెస్ దృష్ట్యా ఆనంద్‌కుమార్ వారం రోజుల క్రితం తిరిగి మస్కట్ వెళ్లిపోయారు. సంధ్యారాణి వెళ్లాల్సి ఉండగా.. ఆమెకు జ్వరం వచ్చింది. జ్వరం తగ్గాకా వెళదామని ఆమె నిర్ణయించుకుని తన ప్రయాణాన్ని ఆపేశారు. కుమార్తెను బెంగళూరులో విడిచిపెట్టి మస్కట్ వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో బస్సులో వెళ్తుండగా ఊహించని ప్రమాదం ఎదురైంది.
ఇవి కూడా చదవండి:
EC On Jubilee Hills Bye Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఎన్నికల కమిషన్ కీలక సూచనలు
Harish Rao: రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి ఇదొక అవకాశం: హరీశ్ రావు