Share News

Abhishek Nayar: కేకేఆర్ ప్రధాన కోచ్‌గా అభిషేక్‌ నాయర్‌!

ABN , Publish Date - Oct 26 , 2025 | 02:39 PM

గత ఐపీఎల్‌లో ఘోర ప్రదర్శన అనంతరం ప్రధాన కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిత్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌ తప్పించి విషయం తెలిసిందే. అయితే తాజాగా కేకేఆర్‌కు కొత్త ప్రధాన కోచ్...

Abhishek Nayar: కేకేఆర్ ప్రధాన కోచ్‌గా అభిషేక్‌ నాయర్‌!

ఐపీఎల్(IPL 2026) హంగులు త్వరలోనే మొదలు కానున్నాయి. డిసెంబర్‌లో మినీ వేలం ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి .ఈ నేపథ్యంలో గత ఐపీఎల్‌లో ఘోర ప్రదర్శన అనంతరం ప్రధాన కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిత్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR) తప్పించి విషయం తెలిసిందే. అయితే తాజాగా కేకేఆర్‌కు కొత్త ప్రధాన కోచ్ వస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రకాంత్ పండిత్ స్థానంలో మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్‌(Abhishek Nayar)కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించడమే తరువాయి. గతంలో అభిషేక్ నాయర్ భారత క్రికెట్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.


కోల్‌కతా ఫ్రాంచైజీతో అభిషేక్ నాయర్‌కు ఎంతో అనుబంధం ఉంది. ఈ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సమయంలో ఆటగాళ్ల ఫామ్‌పై దృష్టి సారించి సత్ఫలితాలు సాధించాడు.ఇక ప్లేయర్ల ఫిట్‌నెస్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాడు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ రోహిత్ శర్మ. అభిషేక్ నాయర్ పర్యవేక్షణలోనే రోహిత్ నాజూగ్గా తయారై ఆసీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రధాన కోచ్‌గా కేకేఆర్ తీసుకోనుండటంతో కొత్త అధ్యాయం మొదలు కానుంది. కాగా 2014లో గంభీర్ మెంటార్‌గా ఉన్నప్పుడు కేకేఆర్ ఐపీఎల్ విజయం సాధించింది. మళ్లీ కేకేఆర్‌ను విజయాల బాట పట్టించాల్సిన బాధ్యత అభిషేక్‌పై ఉంది.


Also Read:

Sridhar Vembu: భారత్‌కు తిరిగొచ్చేయండి.. ఎన్నారైలకు శ్రీధర్ వెంబు అభ్యర్థన

Tea Stain Removal Tips: టీ కప్పులపై మొండి మరకలు.. ఈ హోం ట్రిక్స్‌తో మాయం.!

Updated Date - Oct 26 , 2025 | 02:39 PM