Home » Russia
భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టి మద్దతు తెలిపారు. ఆంక్షల ద్వారా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ఏ ప్రయత్నమైనా తిరగబెడుతుందని ఆయన అన్నారు. సార్వభౌమ దేశాలు తమ రక్షణ, ఆర్థిక భాగస్వాములను ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండాలని పుతిన్ నొక్కి చెప్పారు.
భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ఆఫర్ చేశారు. భారత్‌తో కలిసి ఎస్‌యూ-57 ఉత్పత్తి చేసేందుకు సిద్ధమేనని చెప్పారు. సాంకేతికత బదిలీపై కూడా ఎలాంటి ఆంక్షలు ఉండవని పుతిన్ పేర్కొన్నారు.
రష్యా నుంచి ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం నాల్గవ స్క్వాడ్రన్ భారత్‌కు చేరుకుంది. దీంతో భారత గగనతల రక్షణ మరింత బలోపేతం కానుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా రష్యా పర్యటనకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సిద్ధమయ్యారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు రష్యాలో మంత్రి లోకేశ్ పర్యటించనున్నారు.
దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి బ్రిటన్ గూఢచారి సంస్థ జీసీహెచ్‌క్యూ (GCHQ) సంచలన విషయాలు వెల్లడించింది. 2022లో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు మరణించినట్లు ఆ సంస్థ చీఫ్ కీస్ట్ బట్లర్ వెల్లడించారు.
నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇవాళ(ఆదివారం) అత్యంత భయానకమైన రాత్రి నమోదైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, దాని పరిసర ప్రాంతాలపై రష్యా వందలాది క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌తో పాటు పలు దేశాలకు గతంలో ఇచ్చిన తాత్కాలిక సడలింపుల గడువు(మే 16)ను పెంచకూడదని ట్రంప్ నిర్ణయించారు. అయితే, దేశీయ ప్రయోజనాలే పరమావధిగా రష్యా నుంచి చమురు దిగుమతులను మునుపటిలాగే కొనసాగిస్తామని భారత్ తేల్చిచెప్పింది.
అమెరికా ఆంక్షల మినహాయింపులు ఉన్నా, లేకపోయినా రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని భారత కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాలే తమకు ముఖ్యమని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. భారీ మూల్యం తప్పదని భారత్‌కు హెచ్చరికలు సైతం జారీ చేసింది. పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తామని స్పష్టం చేసింది.
రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ భారీగా డ్రోన్లతో విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ దాడుల్లో ఓ ...