Donald Trump-Russia : రష్యాపై రెండో విడత, మాస్కో ఎకానమీ కుప్పకూలుతుందంటున్న ట్రంప్!
ABN , Publish Date - Sep 08 , 2025 | 07:27 AM
రష్యాపై రెండో విడత సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఈయూ దేశాలు కూడా రష్యా మీద సుంకాలు విధిస్తే మాస్కో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని కూడా చెబుతున్నారు. దీనిపై యూరోపియన్ దేశాల మీద కూడా ఒత్తిడి తెచ్చి..
ఇంటర్నెట్ డెస్క్ : రష్యాపై రెండో విడత సుంకాలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. రష్యాపై రెండో విడత సుంకాలు వేస్తామని తాజాగా మళ్లీ ప్రకటించారు ట్రంప్. అంతేకాదు, EU దేశాలు కూడా రష్యా మీద సుంకాలు విధిస్తే మాస్కో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని కూడా చెబుతున్నారు. ఇందుకోసం యూరోపియన్ యూనియన్ దేశాల మీద కూడా ఒత్తిడి తెచ్చి, రష్యాపై మరిన్ని సుంకాలు విధించే ప్లాన్స్ చేస్తు్న్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.
ఇలా.. అమెరికా అధ్యక్షుడు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి తన 'సుంకాల ఆయుధం'ను మరింత ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. జులై 14, 2025న వైట్ హౌస్‌లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో భేటీ అయిన ట్రంప్, రష్యాపై 'రెండో విడత' సుంకాలు విధించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ప్రధానంగా 'సెకండరీ టారిఫ్స్' రూపంలో ఉంటుంది. అంటే రష్యన్ చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలైన చైనా, ఇండియా, టర్కీ వంటి దేశాలపై 100 శాతం వరకు సుంకాలు వేయాలని ట్రంప్ భావించారు.
అయితే, చకచకా మారుతున్న జియో పొలిటికల్ ఇష్యూస్ కారణంగా ట్రంప్ రోజుకో విధంగా తన వ్యాఖ్యల్ని మార్చాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. సుంకాలు పేరు చెప్పి ఇండియా, చైనా వంటి దేశాలను దారికి తెచ్చుకోవాలన్న ట్రంప్ ఆటలు ఆయా దేశాలు సాగనివ్వడంలేదు. దీనికి తోడు స్వదేశం(అమెరికాలో) ప్రజలు, విపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడిని ట్రంప్ ఎదుర్కొంటున్నారు. దీంతో చేసేది లేక అమెరికా అధ్యక్షుడు కాసేపు, ఆయా దేశాలు తమకు శతృదేశాలని, తర్వాతి రోజే అవన్నీ అమెరికాకు మిత్రదేశాలేనంటూ గడికోమాట మారుస్తున్నారు. ఈ క్రమంలో డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ ఆటలు ఆయనకు, అమెరికాకు ఎంతవరకూ ఫలితాల్ని ఇస్తాయో చూడాలి.
ఇదిలా ఉంటే, ఇటీవలే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ భేటీ అయ్యారు. చర్చలు సానుకూలంగా జరిగాయంటూ ప్రకటనలు చేశారు. పుతిన్‌తో షేక్ హ్యాండ్స్, ఆలింగనాలు వంటి రాసుకుపూసుకు తిరిగిన ఫొటోలు పోస్ట్ చేశారు. మళ్లీ ఇప్పుడు రెండో విడత సుంకాలు అంటుండటం ప్రపంచదేశాల్ని ట్రంప్ చేష్టలు అయోమయంలోనూ, ప్రపంచ వాణిజ్యాన్ని డోలాయమానంలోనూ పడేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి