Share News

Ukraine Independence Day: ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం వేళ కూడా ఇరు దేశాల మధ్య దాడులు

ABN , Publish Date - Aug 24 , 2025 | 07:55 PM

ఈరోజు (ఆగస్టు 24న) ఉక్రెయిన్ తన 34వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా పలు దేశాలు ఉక్రెయిన్‌కి మద్దతు తెలుపగా, మరికొన్ని దేశాలు మాత్రం సాయం ప్రకటించాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Ukraine Independence Day: ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం వేళ కూడా ఇరు దేశాల మధ్య దాడులు
Ukraine Independence Day

ఉక్రెయిన్ ఈరోజు (ఆగస్టు 24, 2025) తన 34వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. 1991లో సోవియట్ యూనియన్ నుంచి ఇదే రోజు స్వాతంత్రం పొందింది. కానీ, ఈ సందర్భంలోనూ రష్యాతో జరుగుతున్న యుద్ధం ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. డ్రోన్, మిస్సైల్ దాడులు, అంతర్జాతీయ మద్దతు వంటి అంశాలతో మరోసారి వార్తల్లో నిలిచింది.


రష్యాపై డ్రోన్ దాడులు

ఉక్రెయిన్ శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు భారీ ఎత్తున డ్రోన్ దాడులు చేసిందని రష్యా అంటోంది. వీటిలో కొన్ని దాడులు రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రంపై జరిగాయని ఆరోపణ. ఈ దాడిలో ఒక ట్రాన్స్‌ఫార్మర్‌కు నిప్పు అంటుకుంది, కానీ అది త్వరగా అదుపులోకి వచ్చింది.

రేడియేషన్ స్థాయిలు సురక్షితంగానే ఉన్నాయని అణు కేంద్రం అధికారులు చెప్పారు. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) ఈ ఘటనను ఇంకా ధృవీకరించలేదు. కానీ అణు కేంద్రాలను ఎల్లవేళలా రక్షించాలని డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో గ్రాస్సీ అన్నారు.


రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు

ఇదే సమయంలో రష్యాలోని ఉస్ట్-లుగా పోర్ట్‌లో కూడా ఒక డ్రోన్ దాడి కారణంగా మంటలు చెలరేగాయి. ఈ పోర్ట్ రష్యాకు ఇంధన ఎగుమతులకు కీలకమైంది. స్థానిక గవర్నర్ చెప్పిన దాని ప్రకారం, 10 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామన్నారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పిన దాని ప్రకారం, శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు 95 ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు తెలిపారు.

అటు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ కూడా రష్యా 72 డ్రోన్లు, ఒక క్రూయిజ్ మిస్సైల్‌ను తమ దేశంలోకి పంపిందని, వాటిలో 48 డ్రోన్లను కూల్చామని తెలిపింది. ఈ దాడులు రెండు వైపులా ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ సంఖ్యలే చెప్తున్నాయి.


మన భవిష్యత్తు మన చేతుల్లోనే

ఈ ఉద్రిక్తతల మధ్య ఉక్రెయిన్ తన స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. కీవ్‌లోని ఐకానిక్ ఇండిపెండెన్స్ స్క్వేర్‌లో ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడారు. ఉక్రెయిన్ బలంగా, శాంతియుతంగా జీవించే దిశగా అడుగులు వేస్తోందన్నారు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్నారు. ప్రపంచం ఉక్రెయిన్‌ను సమానంగా గౌరవిస్తోందని, అమెరికా-రష్యా సమావేశం గురించి కూడా ప్రస్తావించారు.


అంతర్జాతీయ మద్దతు

ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అనేక దేశాల నాయకులు ఉక్రెయిన్‌కు సపోర్ట్ ప్రకటించారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ కీవ్‌లో జెలెన్‌స్కీని కలిశారు. అమెరికా ప్రత్యేక దూత కీత్ కెల్లాగ్‌కు జెలెన్‌స్కీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డ్ ప్రకటించారు. నార్వే ప్రధాని జోనాస్ గాహ్ర్ స్టోర్ 7 బిలియన్ క్రోనర్ ($695 మిలియన్) సైనిక సాయం ప్రకటించారు. ఇందులో ఎయిర్ డిఫెన్స్ రాడార్, రెండు పాట్రియాట్ మిస్సైల్ సిస్టమ్‌లు ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 24 , 2025 | 07:56 PM