ISRO First Integrated Air Drop Test : ఇస్రో 'క్రూ మోడ్యూల్ డ్రాప్ టెస్ట్' సక్సెస్
ABN , Publish Date - Aug 24 , 2025 | 07:47 PM
నెల్లూరు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో గగన్‌యాన్ మిషన్ల కోసం ఒక పరీక్షను విజయవంతం చేసింది. ఇది మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్. భవిష్యత్తులో ప్రయోగించబోయే మానవ సహిత..
ఉమ్మడి నెల్లూరు, ఆగస్టు 24 : సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో ఇస్త్రో(ISRO) ఒక సరికొత్త పరీక్షను ఇవాళ విజయవంతంగా నిర్వహించింది. గగన్‌యాన్ మిషన్ల(Gaganyaan missions) కోసం ఈ పరీక్షను నిర్వహించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(Indian Air Force), DRDO, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ ల సంయుక్త సహకారంతో ఈ పరీక్ష విజయవంతంగా ముగించారు.

గగన్‌యాన్ మిషన్ల కోసం పారాచూట్ ఆధారిత డిసిలరేషన్ సిస్టమ్ ఎండ్ టు ఎండ్ ప్రదర్శన(End to End Demonstration) చేశారు. ఇస్రో మొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-01) ఇది. ఇందులో భాగంగా భవిష్యత్తులో ప్రయోగించబోయే మానవ సహిత ప్రయోగాలకు ఉపయోగించే 'క్రూ మోడ్యూల్' టెస్ట్ చేశారు.
శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి 35 కిలోమీటర్ల దూరంలో భూమి ఉపరితలం నుంచి 3 కిలోమీటర్ల ఎత్తున డ్రాప్ టెస్ట్ చేశారు.(Integrated Air Drop Test (IADT)). ప్రధానంగా ఈ పరీక్షలో వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు, పేరాచూట్(Parachute based deceleration system) సమర్ధత, పనితీరు, వ్యోమగాములను సురక్షితంగా తీసుకురావడానికి కావలసిన పరిస్థితులను పరీక్షించారు. అనంతరం సముద్రంలో పడిన క్రూ మోడ్యూల్'ను నేవి దళల వారు సేకరించి చెన్నై పోర్టుకు తరలించారు.

ఇవి కూడా చదవండి
భార్యను చంపిన భర్త.. చిన్న పిల్లాడు మొత్తం..
విశాఖపట్నంలో సేనతో సేనాని కార్యక్రమం.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల