Share News

US Advisor Blames India: అది మోదీ నడిపిస్తున్న యుద్ధం

ABN , Publish Date - Aug 29 , 2025 | 03:23 AM

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఇండియానే కారణమని శ్వేతసౌధం వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో ఆరోపించారు. ఆ యుద్ధాన్ని మోదీ నడిపిస్తున్న యుద్ధంగా..

US Advisor Blames India: అది మోదీ నడిపిస్తున్న యుద్ధం

  • రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై శ్వేతసౌధం సలహాదారు పీటర్‌ నవారో వ్యాఖ్య

న్యూయార్క్‌/వాషింగ్టన్‌, ఆగస్టు 28: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఇండియానే కారణమని శ్వేతసౌధం వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో ఆరోపించారు. ఆ యుద్ధాన్ని ‘మోదీ నడిపిస్తున్న యుద్ధం’గా అభివర్ణించారు. ఓ టీవీ చా నల్‌ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌ రష్యా నుంచి రాయితీపై చమురు కొంటోంది. దాన్ని భారత రిపైనరీలు రష్యా రిఫైనరీల భాగస్వామ్యంతో ఇతర దేశాలకు అధిక ధరకు విక్రయిస్తున్నాయి. రష్యా అలా వచ్చిన డబ్బును ఉక్రెయిన్‌పై యుద్ధానికి, ఉక్రెయిన్‌ ప్రజలను చంపడానికి వాడుతోంద’ని నవారో ఆరోపించారు. రష్యా నుంచి భారత్‌ చమురు కొనడం ఆపేస్తే.. మరుసటి రోజు నుంచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాలను 25 శాతానికి తగ్గిస్తారని చెప్పారు. కాగా, భారత్‌పై ట్రంప్‌ సుంకాల బాదుడును పలువురు విపక్ష డెమోక్రాట్లు ఖండించారు.


ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 03:25 AM