Discount On Oil: ట్రంప్ టారిఫ్ వార్.. ఇండియాకు రష్యా బంపర్ ఆఫర్..
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:52 PM
Discount On Oil: అమెరికా నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా .. భారత్ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. క్రూడ్ ఆయిల్ దిగుమతిని కొనసాగించింది. ఇప్పుడు రష్యా ప్రకటించిన డిస్కౌంట్‌తో తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోనుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. రష్యా, భారత్ మధ్య వ్యాపార సంబంధాలను నాశనం చేయాలని చూస్తున్న ఆయన ప్రయత్నాలు ఘోరంగా విఫలం అవుతున్నాయి. తాజాగా, ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. మిత్ర దేశం రష్యా, భారత్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇకపై క్రూడ్ ఆయిల్‌ను ఐదు శాతం డిస్కౌంట్‌తో సప్లై చేయనుంది. ఈ విషయాన్ని డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ రష్యా టు ఇండియా ఎవ్‌జెనియ్ గ్రివ స్వయంగా వెల్లడించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇండియాకు సప్లై చేసే క్రూడ్ ఆయిల్‌పై ఐదు శాతం డిస్కౌంట్ ఉంటుంది. రాజకీయ పరిస్థితులు అంతగా బాగోలేకపోయినప్పటికి .. అదే స్థాయిలో క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేస్తాము. ఐదు శాతం డిస్కౌంట్ అన్నది ఫిక్స్ కాదు.. అంతకంటే ఎక్కువ డిస్కౌంట్ ఉండవచ్చు లేదా తక్కువ ఉండవచ్చు’ అని అన్నారు. కాగా, అమెరికా నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా .. భారత్ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. క్రూడ్ ఆయిల్ దిగుమతిని కొనసాగించింది.
ఇప్పుడు రష్యా ప్రకటించిన డిస్కౌంట్‌తో తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోనుంది. అయితే, టారిఫ్‌ల విషయంలో ట్రంప్ కూడా వెనక్కు తగ్గటం లేదు. భారత్ తన మాట వినకపోవటంతో ఏకంగా 50 శాతం టారిఫ్ విధించారు. అంతటితో ఆగకుండా భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ‘భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవటం ఆపేయాలి. రష్యా నుంచి ఆయిల్ కొనటం అంటే.. ఇక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తున్నట్లే’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
యూరియా ఇవ్వకపోతే తీవ్ర ఉద్యమమే.. తేల్చి చెప్పిన హరీష్ రావు
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు