Home » Russia
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాల మాట వినిపిస్తున్నారు. ఒకపక్క భారత్‌తో స్నేహ సంబంధాలు ఉన్నాయని చెబుతూనే భారీ సుంకాలు విధిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా, భారత్, చైనాపై 100 శాతం సుంకాల ప్రతిపాదన తీసుకొచ్చారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయానికి మద్దతు తెలిపారు. రష్యాతో ఇంకా వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లు న్యాయమైనవే అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు.
రష్యాపై రెండో విడత సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పుకొస్తున్నారు. ఈయూ దేశాలు కూడా రష్యా మీద సుంకాలు విధిస్తే మాస్కో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని కూడా చెబుతున్నారు. దీనిపై యూరోపియన్ దేశాల మీద కూడా ఒత్తిడి తెచ్చి..
కీవ్ మంత్రిమండలి భవంతి పైకప్పు నుంచి పొగలు రావడం కనిపించాయని, అయితే క్షిపణులు తాకడం వల్లే ఈ పొగలు వచ్చాయా అనేది తెలియాల్సి ఉందని కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ క్యాబినెట్ బిల్డింగ్‌పై దాడి జరిగినట్టు కీవ్ ప్రతినిధి ధ్రువీకరించారు.
ఎస్‌సీఓ సదస్సుకు చైనా ఇటీవల ఆతిథ్యం ఇచ్చింది. పది సభ్యదేశాలు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ సహా 20 ఆహ్వానిత నేతలు ఒకే వేదిక మీదకు వచ్చారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఇండియానే కారణమని శ్వేతసౌధం వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఆరోపించారు. ఆ యుద్ధాన్ని మోదీ నడిపిస్తున్న యుద్ధంగా..
రష్యానుంచి భారత్ క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటూ ఉంది. దీంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. ఏకంగా 50 శాతం టారీఫ్ విధించారు. అయినా కూడా భారత్ వెనక్కు తగ్గలేదు.
ఈరోజు (ఆగస్టు 24న) ఉక్రెయిన్ తన 34వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా పలు దేశాలు ఉక్రెయిన్‌కి మద్దతు తెలుపగా, మరికొన్ని దేశాలు మాత్రం సాయం ప్రకటించాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాస్కోలో సమావేశమయ్యారు. ఈ భేటీ భారత్-రష్యా సంబంధాల్లో మరింత బలాన్ని తీసుకురావడంలో కీలకంగా మారింది.
భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆహ్వానం పలికారు. తద్వారా వ్యాపారాన్ని మరింత విస్తృత పరుచుకోవాలన్నారు.