Share News

India Top Oil Supplier Russia: భారత్‌కు చమురు సరఫరాలో టాప్.. అమెరికా బెదిరింపులకు తగ్గని రష్యా

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:40 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరింపులకు రష్యా ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌కు అత్యధికంగా ముడి చమురు సరఫరా చేస్తూనే ఉంది. అయితే,

India Top Oil Supplier Russia: భారత్‌కు చమురు సరఫరాలో టాప్.. అమెరికా బెదిరింపులకు తగ్గని రష్యా
India Top Oil Supplier Russia

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా (USA) అధ్యక్షుడు ట్రంప్‌ ఎన్ని హెచ్చరికలు చేసినా, భారత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మన దేశంలోని రిఫైనరీలు (పెట్రోలు, డీజిల్ తయారీ కేంద్రాలు) రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. ఇతర దేశాల నుండి కూడా భారత్ చమురు కొనుగోళ్లు చేస్తోంది. కానీ, అందులో అత్యధికంగా రష్యా నుంచే వస్తోంది. అంటే, ప్రస్తుతం రష్యానే భారత్‌కు ముడి చమురు సరఫరా చేసే అతి పెద్ద దేశం అని తాజా నివేదికలు చెబుతున్నాయి.


అంతర్జాతీయ వాణిజ్య అనలిటిక్స్‌ సంస్థ కెప్లెర్ విడుదల చేసిన నివేదికల ప్రకారం, 2025 సెప్టెంబర్‌లో భారత్‌ దిగుమతి చేసుకున్న మొత్తం ముడి చమూరులో 34 శాతం రష్యా (మాస్కో) నుంచే వచ్చింది. అంటే ,సెప్టెంబర్ నెలలో రోజుకు సగటున 45 లక్షల బ్యారెళ్ల చమురును రష్యా నుంచి కొనుగోలు చేసింది. అయితే, ఆగస్టు నెలతో పోల్చితే సెప్టెంబర్‌లో ఈ కొనుగోళ్లలో 10 శాతం తగ్గుదల కనిపించింది అని నివేదికలు చెబుతున్నాయి.


ఆగస్టు నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో రష్యా నుంచి భారత్‌కు 70,000 బ్యారెళ్లు ఎక్కువ చమురు వచ్చింది. కానీ, గత ఏడాది సెప్టెంబర్‌తో పోల్చితే పెద్దగా మార్పు కనిపించలేదు. ఈ నెలలో భారత్‌ రోజుకు సగటున 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. దీని వలన రష్యా, మొత్తం చమురు దిగుమతుల్లో 34% వాటాతో భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది. అయితే, 2025లో జనవరి నుంచి ఆగస్టు వరకు రష్యా నుంచి వచ్చిన సగటు రోజువారీ చమురు సరఫరాతో పోలిస్తే, సెప్టెంబర్‌లో ఈ సంఖ్య 1,80,000 బ్యారెళ్ల తక్కువగా ఉంది. ఈ తగ్గుదలకి కారణం మార్కెట్‌లో చోటుచేసుకున్న మార్పులేనని, అమెరికా నుంచి వచ్చిన బెదిరింపులకు దీనితో ఎలాంటి సంబంధం లేదని అంతర్జాతీయ విశ్లేషణ సంస్థ కెప్లెర్ స్పష్టంగా తెలిపింది.


గత కొన్ని సంవత్సరాలుగా భారత్‌కు అత్యధికంగా ముడి చమురును సరఫరా చేస్తున్న దేశం రష్యానే. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ బెదిరింపులకు దిగినా, రష్యా మాత్రం వెనక్కి తగ్గలేదు. 2025 జులై నెలలో, రష్యా భారత్‌కు సుమారు 3.6 బిలియన్ డాలర్ల విలువైన (భారత కరెన్సీలో చూస్తే రూ. 31,775 కోట్లు) చమురును విక్రయించింది. భారత్‌ మొత్తం చమురు దిగుమతుల్లో 34 శాతం రష్యా నుంచే వస్తోంది. రష్యా తర్వాత చమురు సరఫరా చేస్తున్న దేశాలు ఇరాక్‌, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE).


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మూడు దగ్గు మందులు ప్రమాదకరం

షాకింగ్‌ .. ఎమ్‌టీవీ మ్యూజిక్‌ ఛానల్‌ మూసివేత

Read Latest Telangana News and National News

Updated Date - Oct 15 , 2025 | 11:44 AM