Russia-Indian Cinema: భారతీయ సినిమాలంటే రష్యన్లకు చాలా ఇష్టం
ABN , Publish Date - Oct 03 , 2025 | 01:25 PM
భారతీయ సినిమాలంటే తమకు ఎంతో ఇష్టమంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అందుకే ఇండియన్ సినిమాలను రాత్రింబవళ్లు ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ టెలివిజన్ ఛానల్..
ఇంటర్నెట్ డెస్క్ : భారతీయ సినిమాలపై రష్యన్లకు ఉన్న ప్రేమను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బయటపెట్టారు. భారతీయ సినిమాలంటే తమకు ఎంతో ఇష్టమంటూ ప్రశంసలు కురిపించారు. రష్యాలో ఇండియన్ మూవీస్‌కు చాలా పాపులారిటీ ఉందని పుతిన్ అన్నారు. రష్యాలోని సోచీలో నిర్వహించిన వల్దాయి క్లబ్ ప్లీనరీ సెషన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తమకు భారతీయ సినిమాలంటే చాలా ప్రేమ అని చెప్పిన పుతిన్.. అందుకే ఇండియన్ సినిమాలను రాత్రింబవళ్లు ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ టెలివిజన్ ఛానల్‌ను కూడా నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. అంతేకాదు, భారత్ వెలుపల, భారతీయ సినిమాల్నిలా నిరంతర ప్రసారాలు చేస్తున్న ఏకైక దేశం బహుశా రష్యానే అనుకుంటూ అని కూడా పుతిన్ అన్నారు.
భారత, రష్యాల మధ్య రాజకీయ, దౌత్య సంబంధాలు మాత్రమే గాక.. సాంస్కృతిక, మానవీయ బంధం కూడా బలంగా ఉందని పుతిన్ పేర్కొన్నారు. దశాబ్దాల కాలంగా చాలామంది భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుతున్న విషయాన్ని గుర్తు చేసిన పుతిన్.. భారతీయ సంస్కృతి, ముఖ్యంగా సినిమాలపై రష్యన్లు విపరీతమైన ఆసక్తి కనబరుస్తారని తెలిపారు. సోవియెట్ కాలం నుంచే రష్యాలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోందని పుతిన్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Drinking Tea Empty Stomach: పరగడుపున టీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..
Special Trains: ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. పండుగల సందర్భంగా ప్రత్యేక రైళ్లు..