Home » Road Accident
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న సితారా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూలింగ్ కెనాల్ డివైడర్‌ను ఢీకొంది. అయితే బస్సు ముందుభాగం కూలింగ్ కెనాల్ వంతెనను ఢీకొని అక్కడే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ హిల్స్ రోడ్లు డెత్ స్పాట్‌లుగా మారుతున్నాయి. విశాలమైన రోడ్లు, ఏటవాలుగా వేగంగా తిరిగే మలుపులు మృత్యువుకు దారితీస్తున్నాయి.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలేకమ్మ గుడి సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా కోదాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న యోలా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఆరుగురు గాయపడ్డారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 216వ జాతీయ రహదారి ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.
కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లాడ్లాపూర్ సమీపంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.
ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కైంచి ధామ్ సమీపంలో ప్రమాదవశాత్తూ లోయలోకి కారు దూసుకెళ్లడంతో ఐదుగురు మృతిచెందారు.
మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 10 మందికిపైగా మృతిచెందగా, మరో 25 మందికి పైగా గాయపడ్డారు.
హైదరాబాద్‌లోని పాతబస్తీ సంతోష్‌నగర్ డీఎంఆర్‌ఎల్ ఎక్స్‌రోడ్ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహ్మద్ అల్తాఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. లారీని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో జై భారత్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.