Share News

అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరు యువకుల మృతి..

ABN , Publish Date - Apr 13 , 2026 | 08:14 PM

కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లాలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది.

అదుపుతప్పి కారు బోల్తా.. ఇద్దరు యువకుల మృతి..
Kadapa road accident

ఇంటర్‌నెట్ డెస్క్: కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన వివరాల మేరకు.. అట్లూరు గోపవరం మండలానికి చెందిన చెన్నకేశవులు, శివచందులు కారులో ప్రయాణిస్తున్నారు. బద్వేల్ పట్టణ శివారులోని మడకలవారిపల్లె దగ్గర కారు అదుపుతప్పి బోల్తా పడింది.


దీంతో కారులో ప్రయాణిస్తున్న చెన్నకేశవులు, శివచందు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో గాయపడ్డ ఇద్దరినీ దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

ఏపీ పెన్షనర్లకు అలర్ట్.. ఇకపై 'నిధి' పోర్టల్ ద్వారానే పెన్షన్ ప్రాసెసింగ్.. కీలక ఉత్తర్వులు జారీ!

చందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి అనిత

Updated Date - Apr 13 , 2026 | 08:24 PM