Share News

లోయలో పడ్డ వ్యాన్.. 10 మంది మృతి..

ABN , Publish Date - Apr 17 , 2026 | 06:48 PM

వ్యాన్ లోయలో పడ్డ ఘటనలో 10 మంది చనిపోగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు జిల్లాలోని వాల్పరై ఘాట్ రోడ్డులో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

లోయలో పడ్డ వ్యాన్.. 10 మంది మృతి..
Tamil Nadu accident

ఇంటర్‌నెట్ డెస్క్: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్ లోయలో పడ్డ ఘటనలో 10 మంది చనిపోగా.. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు జిల్లాలోని వాల్పరై ఘాట్ రోడ్డులో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం కొండ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పింది. వేగంగా వెళ్లి లోయలో పడిపోయింది. పైనుంచి కిందపడ్డంతో వ్యాన్ నుజ్జునుజ్జయింది. వ్యానులో ఉన్న పది మంది అక్కడికక్కడే చనిపోయారు.


మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు 10 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


మరో ఘటనలో..

కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై వేగంగా దూసుకు వెళుతున్న కారు టైర్ పేలింది. ఒక్కసారిగా అదుపుతప్పిన కారు.. వేగంగా వెళ్లి బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా కారుకు వ్యాపించాయి. కారు, బస్సు మంటల్లో దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరు మంది కాలి బూడిదయ్యారు. బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయి.


ఇవి కూడా చదవండి

ఇండి కూటమి సభ్యులు బిల్లును వ్యతిరేకించారు: అమిత్‌ షా

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

Updated Date - Apr 17 , 2026 | 06:48 PM