Home » RJD
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పాట్నా హైకోర్టు దోషిగా నిర్దారించడంపై తొమ్మిదిన్నరేళ్లు జైలు శిక్ష అనుభవించిన రాజ్‌బల్లభ్ యాదవ్ గత నెలలో విడుదలయ్యారు. అయితే, బిహార్ ఎన్నికల వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
అహ్లాదకరమైన వాతావరణంలో సమావేశం జరిగిందని, సీట్ల పంపకాలపై భాగస్వామ్య పార్టీలు ఒక విస్తృత అవగాహనకు వచ్చాయని సమావేశానంతరం బిహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ రామ్ తెలిపారు.
బీహార్‌లో ఇటీవల రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో కొందరు మరణించిన ప్రధాని తల్లిపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై పీఎం మోదీ తాజాగా స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
దేశంలోకి అక్రమ చొరబాటుదారుల జనాభా పెరగడం ఆందోళన కలిగించే విషయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తాను ఒక జనాభా మిషన్‌ను ప్రతిపాదించానని..
నవడా ర్యాలీలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, ఓట్ల చోరీకి ఎలక్షన్ కమిషన్, బీజేపీ చేతులు కలిపాయని, బిహార్ ప్రజలను ఫూల్స్ చేయాలనుకుంటున్నాయని ఆరోపించారు. ఓటు హక్కును చోరీ చేయాలని బీజేపీ అనుకుంటోందని, ఎస్ఐఆర్ అనేది ఓట్ల దోపిడీ అని, ఇదెంతమాత్రం సాగనీయమని అన్నారు.
చొరబాటుదారులే వారి ఓటు బ్యాంకు.. అందుకే SIR ని కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఓట్ల కోసం దేశ ప్రజలకి తీరని ద్రోహం చేస్తున్నారని..
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్-నవంబర్‌లో జరగాల్సి ఉండగా ఈసీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియను కొనసాగించిన ఈసీ ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది.
రెండు ఓటర్లు కార్డులు కలిగి ఉండటం ద్వారా తేజస్వి నేరానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. 2020 పోల్ అఫిడవిట్‌లో తేజస్వి చూపించిన ఓటర్ ఐడీ, శనివారం నాడు చూపించిన ఓటర్ ఐడీ ఒకటి కాదని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియాకు తెలిపారు.
ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎలాంటి పారదర్శకత లేకుండా నిర్వహించిందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. రాజకీయ పార్టీలను లూప్ నుంచి దూరంగా ఉంచి, పేద, అట్టడుగు ఓటర్లను టార్గెట్ చేసుకుని సామూహికంగా తొలగించిందన్నారు.
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా వెనుక బీజేపీ కుట్ర కనిపిస్తోందని అఖ్తరుల్ అన్నారు. ఉపరాష్ట్రపతి వంటి రాజకీయ ప్రాధాన్యం లేని పదవిని ఇచ్చి నితీష్‌ను తప్పించాలని బీజేపీ భావిస్తోందని చెప్పారు.