Home » Rains
మూడు రోజులుగా దంచికొట్టిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మేఘాలు ఆవరించి.. చెదురుమదురుగా వానలు కురిశాయి. వాయుగుండం తీరం దాటినా ఉత్తరాంధ్రలో వాగులు, నదులు ప్రమాదకరంగా పొంగి పొర్లుతున్నాయి.
రాష్ట్రంలో భారీ వర్షాలకు కారణమైన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతూ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదకాదలో చనిపోయిన వ్యక్తులను శ్మశానానికి తీసుకెళ్లడం అంటే బంధువులకు చచ్చినంత పనే!
భారీ వర్షాల నేపథ్యంలో వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖ అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ‘వార్‌రూమ్’లో వర్షాలు, వరదలను గమనిస్తూ ఉండాలన్నారు.
తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత గురువారం ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మన్యం, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిశాయి. దక్షిణకోస్తాలో మోస్తరు నుంచి భారీగా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వర్షాలకు వాగులు, గెడ్డలు, నదులు పొంగి ప్రవహించేలా వరద వచ్చింది. ఈ నైరుతి రుతుపవనాల సీజన్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది ఇప్పుడే.
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజలకు మంచి చేయాలన్న ప్రభుత్వ సంకల్పలమే ప్రకృతిని సైతం కదిలించిందని రాష్ట్ర హోం శాఖామంత్రి అనిత అన్నారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రంలో ఇంతటి భారీ వర్షాలు కురవడం యాదృచ్చికం కాదని ఆమె ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రాన్ని భారీ వర్షాలతో అతలాకుతలం చేస్తోన్న తీవ్ర వాయుగుండం తీరం దాటింది. నిన్న రాత్రి(బుధవారం) కళింగపట్నం సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు.
కాకినాడలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలెక్టర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు.