Heavy Rains: మరో రెండు అల్పపీడనాలు.. భారీవర్ష సూచన
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:43 AM
బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17 నుంచి డిసెంబరు 7వ తేది వరకు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు.
చెన్నై: బంగాళాఖాతంలో వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17 నుంచి డిసెంబరు 7వ తేది వరకు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు. రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలు, పశ్చిమ కనుమల జిల్లాలు, దిండుగల్, మదురై, తేని, విరుదునగర్, రామనాథపురం, తూత్తుకుడి, తెన్‌కాశి జిల్లాల్లో మంగళవారం చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. విల్లుపురంలో 20 మి.మీ, కోయంబత్తూర్ కోలార్‌పట్టిలో 25, పొల్లాచ్చిలో 21, తాలిలో 22, ఉడుమలైపేటలో 23, మడతుకులంలో 49, కొడైకెనాల్‌లో 61, తెన్‌కాశిలో 72 మి.మీ వర్షపాతం నమోందైంది.
ఈ క్రమంలో, మయన్మార్ నుంచి దక్షిణ దిశగా పయనించి, ప్రస్తుతం మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకున్న అల్పపీడనం శ్రీలంకకు ఆగ్నేయంగా కొనసాగుతున్న వాయుప్రసరణ రెండూ హిమాలయ ప్రాంతం నుంచి గాలి లాగుతున్నాయి. హిమాలయాల చల్లని గాలిగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుండడంతో, ఉదయం మంచు కురుస్తోంది. ఈ ప్రభావంతోనే మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం 14న పశ్చిమ దిశగా పయనించే అవకాశముంది.

ఈ అల్పపీడనం రాష్ట్రానికి 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనప్పటి నుంచి 21వ తేది వరకు చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశముంది. అనంతరం అల్పపీడనం బలపడి అరేబియా సముద్రం వైపు కదలి, దక్షిణ చైనా సముద్రంలో బలహీనపడి, పశ్చిమ దిశగా కదలి 22న తీవ్ర వాయుగుండంగా బంగాళాఖాతంలో చేరుకుంటుంది. ఈ వాయుగుండం రాష్ట్రంలో తీరం దాటే అవకాశముంది.
ఈ కారణంగా, తిరువళ్లూర్ జిల్లా నుంచి కన్నియాకుమారి వరకు 26వ తేది వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. డెల్టాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అంతేకాకుండా, నవంబరు చివరి నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఈ ప్రభావంతో డిసెంబరు 7వ తేది వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిమెంట్ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
సైబర్ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్ ఎడ్జ్
Read Latest Telangana News and National News