Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 8 జిల్లాలకు భారీ వర్ష సూచన
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:33 AM
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడటంతో రాష్ట్రంలో 8 జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక చేసింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరం గా ఉంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణించే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
చెన్నై: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడటంతో రాష్ట్రంలో 8 జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక చేసింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరం గా ఉంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణించే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతంలో పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

రాజధాని చెన్నై నగరంలో మంగళవారం మోస్తరుపాటి వర్షపు జల్లులు పడుతున్నాయి. మంగళవారం భారీ వర్షం కారణంగా విల్లుపురం, కడలూరు(Villupuram, Kadaluru), పుదుచ్చేరి - కారైక్కాల్ ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెల్సిందే. ఇదిలావుంటే, ఈ నెల 22వ తేదీ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
సినిమాలకు.. ఇక సెలవు! నటనకు వీడ్కోలు.. పలికిన నటి తులసి
Read Latest Telangana News and National News