Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 22 నుంచి భారీ వర్షాలు
ABN , Publish Date - Nov 18 , 2025 | 10:06 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబరు 16న నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యాయి.
- వాతావరణ కేంద్రం హెచ్చరిక
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబరు 16న నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. వీటి ప్రభావంతో కోస్తా తీర జిల్లాల్లో దాదాపు వారం రోజులపాటు ఎడతెరపిలేకుండా వర్షాలు కురిసాయి.
అలాగే సముద్రంలో గాలుల వేగం పెరగడంతో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో వేల సంఖ్యలో పడవలు తీరానికే పరిమితమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఆదివారం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇందువల్ల డెల్టా, కోస్తా జిల్లాల్లో మళ్లీ ఆదివారం నుండి వర్షాలు ఊపందుకున్నాయి. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని, దీని ప్రభావంతో వచ్చే శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

ఇదిలా వుండగా, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం(Chengalpattu, Tiruvallur, Kanchipuram), మైలాడుదురై, నాగపగట్నం, తిరువారూర్, కడలూరు, విల్లుపురం, తంజావూరు, పుదుకోట, తిరునల్వేలి, కన్నియాకుమారి ప్రాంతాల్లో సోమవారం ఉదయం మోస్తరు వర్షాలు కురిశాయి. నగరంలో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. సముద్రతీర జిల్లాలతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.. అలాగే మైలాడుదురై, తిరువారూర్, నాగపట్నం జిల్లాల నుండి సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ కార్లకు భలే డిమాండ్
Read Latest Telangana News and National News