Share News

Heavy Rains: 25 వరకు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:37 AM

ఈనెల 25వతేదీ వరకు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఱ తెలిపింది.

Heavy Rains: 25 వరకు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు

- నేటినుంచి తీర ప్రాంతాల్లో వర్షాలు

- వాతావరణ పరిశోధన కేంద్రం

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయి. ఈ పరిస్థితుల్లో, నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు, పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో శుక్రవారం నుంచి ఈ నెల 25వ తేది వరకు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.


ఆ ప్రకారం కడలూరు, నాగపట్టణం, తిరువారూరు. మైలాడుదురై, రామనాధపురం(Ramanathapuram), విరుదునగర్‌, తెన్‌కాశి, కన్నియాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి తదితర జిల్లాల్లో శుక్రవారం భారీవర్షాలు కురిసే అవకాశముంది. అలాగే, కడలూరు, మైలాడుదురై, నాగపట్టణం, తిరువారూరు, తంజావూరు, పుదుకోట, శివగంగ, రామనాథపురం, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో ఈ నెల 22,23 తేదీల్లో భారీవర్షాలు కురిసే అవకాశముంది.


nani1.2.jpg

మైలాడుదురై, నాగపట్టణం, తిరువారూరు, తంజావూరు, పుదుకోట జిల్లాల్లో ఈ నెల 24, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై, నాగపట్టణం, తిరువారూరు, తంజావూరు, పుదుకోట జిల్లాల్లో ఈ నెల 25వ తేది భారీవర్షాలు కురిసే అవకాశముంది. రాజధాని నగరం చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ, కొన్ని ప్రాంతాల్లో తేలికపాలి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 21 , 2025 | 11:37 AM