Share News

AP Heavy Rain Alert: మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు..

ABN , Publish Date - Nov 15 , 2025 | 07:34 PM

మంగళవారం నాడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వెల్లడించారు.

AP Heavy Rain Alert: మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు..
Heavy Rain Alert

అమరావతి: నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal), శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్పపీడనం (Low Pressure) కారణంగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఆయన వెల్లడించారు. ఇది రాగల 24 గంటల్లో పశ్చిమ- వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని పేర్కొన్నారు. సోమవారం రోజు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.


మంగళవారం నాడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో (Rains in Tirupati) అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. సోమవారం వరకూ మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.


నవంబర్ 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారం (Weather Report) ప్రకారం.. నవంబర్ 24 నుంచి 27 వరకూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్.


ఈ వార్తలు కూడా చదవండి:

CII Summit 2025: సీఐఐ సమ్మిట్-2025 సూపర్ హిట్: సీఎం చంద్రబాబు..

Betting Apps Promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు హాజరైన రానా, విష్ణుప్రియ..

Updated Date - Nov 15 , 2025 | 07:38 PM