Rains: 29న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:45 AM
29న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో చెన్నై సహా 11 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశ: ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రప్రజలను, ముఖ్యంగా సముద్రంలో చేపలవేటకు వెళ్లిన జాలర్లను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీచేసింది.
- చెన్నై సహా 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- ప్రాంతీయ వాతావరణ కేంద్రం
చెన్నై: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల 29న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నందున చెన్నై(Chennai) సహా 11 జిల్లాలకు ప్రాంతీయ వాతావరణ కేంద్ర ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ఏర్పడిన నేపథ్యంలో, కన్నియాకుమారి వద్ద కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలో కోస్తా, డెల్టా జిల్లాల్లో మోస్తరు నుండి భారీవర్షాలు కురుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, మంగళవారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా బలపడటంతో సముద్రంలో గాలుల వేగం పెరిగింది. ఈ వాయుగుండం, పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశముందని, దీని ప్రభావంతో ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఇదిలా వుండగా, రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడటం గురించి నుంగంబాక్కంలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రాష్ట్రప్రజలను,

ముఖ్యంగా సముద్రంలో చేపలవేటకు వెళ్లిన జాలర్లను అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీచేసింది. 29, 30వ తేదీల్లో చెన్నై. కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్లు, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై, తంజావూరు, నాగపట్నం, పుదుకోట తదితర 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. మరోవైపు రాణిపేట, వేలూరు, తిరువణ్ణామలై, కళ్లకురుచ్చి, అరియలూరు, పెరంబలూరు, తిరుచ్చి, శివగంగ, రామనాధపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు
మావోయిస్టుల కస్టడీ పిటిషన్ వెనక్కి
Read Latest Telangana News and National News