Judicial Decision: మావోయిస్టుల కస్టడీ పిటిషన్ వెనక్కి
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:26 AM
పెనమలూరు మండలం కానూరులోని కొత్త ఆటోనగర్‌లో పట్టుబడిన మావోయిస్టుల్లో ముగ్గురిని కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం రిటర్న్ చేసింది.
విజయవాడ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): పెనమలూరు మండలం కానూరులోని కొత్త ఆటోనగర్‌లో పట్టుబడిన మావోయిస్టుల్లో ముగ్గురిని కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం రిటర్న్ చేసింది. ఉద్దే రఘు, ఓయం జ్యోతి, మడకం దివాకర్‌ను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పెనమలూరు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి జి.లెనిన్‌బాబు పరిశీలించారు. తమ కోర్టుకు మావోయిస్టులను కస్టడీకి ఇచ్చే అధికారం లేదని, ఆ అధికారంలో ఉన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ రిటర్న్ చేశారు.