Home » Rains
మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద ఉదృతితో మూసారంబాగ్ బ్రిడ్జ్ దెబ్బతింది. అధికారులు ఆ బ్రిడ్జిని రిపేర్ చేసే పనిలో పడ్డారు. దీంతో అక్కడ రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు చేరుతోంది. శుక్రవారం 404.70 అడుగులకు నీటి మట్టం పెరిగింది. మహబూబాబాద్ జిల్లాలోని పాకాల కొత్తగూడం నుంచి గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం అటవీ ప్రాంతాల నుంచి జలాశయానికి 1,700 క్యూసెక్కుల చొప్పున నీరు చేరడంతో డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు.
నగరంలో శుక్రవారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వరద ప్రవాహం కనిపించింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రదేశాల్లో ఇబ్బందులు తలెత్తాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరాలు, వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ప్రాంతాలలో కొనసాగుతోందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి నాగభూషణం వెల్లడించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 19వ తేది వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమ మధ్య, దానిని అనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముంది.
ఈ ఉదయం నుంచి ఢిల్లీతోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. లజ్‌పత్ నగర్, ఆర్‌కె పురం, లోధి రోడ్, ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ అంతటా కురుస్తున్న భారీ వర్షాలకు మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
నగరంలో కురుస్తున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరిచందన దాసరి అధికారులకు సూచించారు. వర్షం తీవ్రత అధికంగా ఉంటే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని పేర్కొన్నారు.
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తోండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ఆరోగ్యశాఖకు మంత్రి దామోదర రాజనర్సింహ కీలక సూచనలు చేశారు. వర్షాల్లో వైద్య సేవలు నిరవధికంగా కొనసాగించాలని ఆదేశించారు. గర్భిణుల కోసం అత్యవసర చికిత్సకూ సిద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సచివాలయంలో రెవెన్యూశాఖ అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు కాలనీల్లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.