Share News

Mumbai Monorail Breaks Down: భారీ వర్షాలు... ట్రాక్ మధ్యలో నిలిచిపోయిన మోనో రైలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 09:03 PM

అగ్నిమాపకదళ అధికారులు ఘటనా స్థలికి చేరుకోవడానికి ముందు పలువురు ప్రయాణికులు భయంతో కిటికీలు బద్దలు కొట్టి బయటపడేందుకు ప్రయత్నించడం విజువల్స్‌లో కనిపిస్తోంది.

Mumbai Monorail Breaks Down: భారీ వర్షాలు... ట్రాక్ మధ్యలో నిలిచిపోయిన మోనో రైలు
Monorail Breaks down in Mumbai

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెండ్రోజులుగా వర్ష బీభత్సం కొనసాగుతుండటంతో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎలివేటెడ్ ట్రాక్‌పై నడిచే మోనో రైలు (Monorail) మంగళవారం సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో నిలిచిపోయింది. చెంబూరు, భక్తి పార్క్ స్టేషన్ల మధ్య సుమారు గంటకు పైగా నిలిచిపోయింది. ఆ సమయంలో 200 మంది వరకూ మోనోరైలులో ప్రయాణిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో స్వల్ప అంతరాయం కారణంగానే రైలు ఆగిపోయినట్టు ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్ డవలప్‌మెట్ అథారిటీ (ఎంఎంఆర్‌డీఏ) తెలిపింది. తమ బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది.


అగ్నిమాపకదళ అధికారులు ఘటనా స్థలికి చేరుకోవడానికి ముందు పలువురు ప్రయాణికులు భయంతో కిటికీలు బద్దలు కొట్టి బయటపడేందుకు ప్రయత్నించడం విజువల్స్‌లో కనిపిస్తోంది.


భయంలేదు: సీఎం

ఘటనా సమచారం తెలిసిన వెంటనే ప్రయాణికుల సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ధైర్యం చెప్పారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువస్తామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. ఎంఎంఆర్‌డీఏ కమిషన్, మున్సిపల్ కమిషనర్, పోలీసులు, సంబంధిత ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తు్న్నామని, ఘటనపై దర్యాప్తు జరుతామని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ తక్షణ ప్రాధాన్యతా క్రమమని ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు. మెడికల్ టీమ్ కూడా ఘటనా స్థలికి చేరుకుందని, ప్రయాణికులెవరూ భయాందోళనకు గురికావద్దని కోరారు.


ఇవి కూడా చదవండి..

పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొన్ని రాహుల్ కారు.. వీడియో షేర్ చేసిన బీజేపీ

నెహ్రూ దేశాన్ని రెండు సార్లు విభజించారు.. ప్రధాని మోదీ

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 19 , 2025 | 09:09 PM