Share News

Rahul Voter Adhikar Yatra: పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొన్ని రాహుల్ కారు.. వీడియో షేర్ చేసిన బీజేపీ

ABN , Publish Date - Aug 19 , 2025 | 07:34 PM

పోలీసును రాహుల్ వాహనం ఢీకొన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కారు వీల్స్ కింద నుంచి బయటపడగానే ఆ పోలీసు కుంటుతూ అక్కడి నుంచి వెళ్లడం వీడియోలో కనిపిస్తోంది.

Rahul Voter Adhikar Yatra: పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొన్ని రాహుల్ కారు.. వీడియో షేర్ చేసిన బీజేపీ
Rahul gandhi

పాట్నా: బిహార్‌లోని నవాడాలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన 'ఓటర్ అధికార్ యాత్ర' (Voter Adhikar Yatra)లో అపశ్రుతి చోటుచేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డులో ఓపెన్ టాప్ జీపులో రాహుల్ ప్రయాణిస్తుండగా ఆయన వాహనం ఒక పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొంది. వెంటనే పోలీసు సిబ్బంది, రాహుల్ గాంధీ మద్దతుదారులు ఆ వాహనాన్ని వెనక్కి నెట్టడం ద్వారా గాయపడిన కానిస్టేబుల్‌ను కాపాడారు. యాత్రకు భద్రత కల్పించే బాధ్యతల్లో పోలీసు కానినిస్టేబుల్ ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.


వీడియో వైరల్

పోలీసును రాహుల్ వాహనం ఢీకొన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కారు వీల్స్ కింద నుంచి బయటపడగానే ఆ పోలీసు కుంటుతూ అక్కడి నుంచి వెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే ఓపెన్ టాప్ జీపుపై ఉన్న రాహుల్ గాంధీ ఒక వాటర్ బాటిల్‌ను తన మద్దతుదారులకు ఇచ్చి గాయపడిన వ్యక్తికి సాయపడాల్సిందిగా కోరారు. నేరుగా ఆయనను కలుసుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


క్రష్ జనతా యాత్ర.. బీజేపీ ఎద్దేవా

రాహుల్ గాంధీ తన వెహికల్‌తో పోలీసు కానిస్టేషల్‌ను తొక్కించారంటూ బీజేపీ ఈ ఘటనపై విమర్శలు గుప్పించింది. ఇది 'క్రష్ జనతా యాత్ర' అని పార్టీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. పోలీసు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారని, ఆయన పరిస్థితి ఏమిటో కూడా రాహుల్ కనుక్కోలేదని విమర్శించారు. రాహుల్ చేపట్టిని ఓటర్ అధికార్ యాత్ర వజీర్‌గంజ్‌లో ప్రారంభమై ప్రస్తుతం నవడా మీదుగా వెళ్లోంది. సెప్టెంబర్ 1న పాట్నాలో ఈ యాత్ర ముగియనుంది.


ఇవి కూడా చదవండి..

ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో విపక్ష కూటమి వ్యూహం ఇదేనా

నెహ్రూ దేశాన్ని రెండు సార్లు విభజించారు.. ప్రధాని మోదీ

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 19 , 2025 | 07:38 PM