Home » Rains
తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంది.
హయత్నగర్లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని వరద ముంచెత్తింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది.
సముద్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... మంగళవారం తిరువణ్ణామలై, కళ్లకుర్చి, తేని, దిండుగల్, మదురై, శివగంగ తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ చాలాచోట్ల ఉత్సవాలు చేయడం, వేడుకలు నిర్వహించడం చూస్తూనే ఉంటాం. కొన్నిచోట్ల కప్పలకు పెళ్లిళ్లు చేశారనే వార్తలూ వింటుంటాం. అయితే మెక్సికోలోని రెండు గ్రామాల ప్రజలు మాత్రం వాన కోసం రక్తం చిందిస్తారు.
వందేళ్లలో ఎప్పుడూ రానంత వరద ఈ ఏడాది వచ్చిందని.. తమ ప్రభుత్వం బాధితులను కచ్చితంగా ఆదుకుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధితులకు అండగా నిలిచి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశారని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక రాష్ట్రాల్లో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో అనేక ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలకు పరిహారం కింద రూ.1.30 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన బాధితులకు ఈ నగదును అధికారులు అందించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.