Share News

Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..

ABN , Publish Date - Sep 14 , 2025 | 08:02 PM

హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం కాస్త ఎండగానే ఉన్నా.. సాయంత్రం మాత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..
Heavy Rain in Hyderabad

హైదరాబాద్, సెప్టెంబర్ 14: హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ముషీరాబాద్, తార్నాక, లక్డీకాపూల్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఆదివారం మధ్యాహ్నం కాస్త ఎండగానే ఉన్నా.. సాయంత్రం మాత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఈ వర్షం కారణంగా... రహదారులు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే ద్విచక్ర వాహనదారులు మాత్రం ఫైఓవర్ల కింద భారీ వర్షానికి తలదాచుకున్నారు.


మరోవైపు భారీ వర్షం కారణంగా.. హైడ్రా, జీహెచ్ఎంసీతోపాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అయితే భారీ వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలిస్తే.. మ్యాన్ హోల్స్ తెరవద్దంటూ ఇప్పటికే ప్రజలకు నగర పాలక సంస్థ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.


దీంతో భారీగా నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో.. జీహెచ్ఎంసీ బృందాలు మ్యాన్స్ హోల్స్ తీసి.. వర్షపు నీరు నాలాలోకి వెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. మరోవైపు భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇలా చేస్తే అంతే అంటూ.. నగర జీవికి వార్నింగ్

హనీ ట్రాప్‌‌లో చిక్కుకున్న యోగా గురువు.. పోలీసుల ఎదుట లబోదిబో..

For More TG News And Telugu news

Updated Date - Sep 14 , 2025 | 08:33 PM