Home » Rain Alert
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు.. ఆగకుండా ఒకటే వాన.. కుంభవృష్టి! కామారెడ్డి, మెదక్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాలో కుండపోతగా కురిసిన వానకు చెరువులు నిండి కట్టలు తెగాయి. వంతెనలు కూలాయి.
మెదక్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 30.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. హావేలిఘనాపూర్ మండలం సర్దనలో 30 సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది. నాగపూర్‌లో 27 సెం. మీ వర్షపాతం నమోదైంది. చేగుంటలో 22 సెం.మీ, రామయంపేట మండలంలో 20 సెం. మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానాకి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జమ్మూ కశ్మీర్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్‌లు, ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఇవాళ(బుధవారం) భారీ వర్షాలు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
భారీ వర్షాలతో.. ముంబై మహానగరం నీటమునిగింది. వర్షాల కారణంగా విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. విమానాలు, రైళ్ల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రయాణికులకు ఇండిగో అలర్టులు జారీ చేసింది. మరోవైపు ఎయిర్‌పోర్టుకు వచ్చే పలు మార్గాలు నీట మునిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వాతావరణ పరిస్థితిపై వైజాగ్ తుపాను హెచ్చరిక కేంద్రం జగన్నాథ్ కుమార్ కీలక సమాచారం ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని చెప్పారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన..
భారీ వర్షాల దాటికి హైదరాబాద్ నగరం అస్తవ్యస్తం అవుతుంది. నిన్న రాత్రి కురుసిన వర్షానికి నగరమంతా జలమయం అయిపోయింది. రోడ్లు చెరువులను తలిపిస్తున్నాయి
నిన్న కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు అన్ని చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లన్ని జలమయం అయ్యాయి. వాటర్ లాగిన్ పాయింట్స్‌లో వర్షపు నీరు నిలిచిపోయింది.
ఇప్పటికే రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కొడుతున్న వానలకు చాల జిల్లాలు జలమయం అయ్యాయి. జన సంచారం స్థంబించిపోయింది. రవాణా వ్యవస్థ డీలా పడింది.