Home » Rain Alert
ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఎగువ ప్రాంతాలతో పాటు చిత్తూరు సమీప మండలాల్లో భారీ వర్షం కురిసిన ప్రతిసారీ నగరంలోని నీవా పరివాహక ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.
జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసాయి.
ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం నాడు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో వర్షాలు పడతాయని ఏపీ విపత్త నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎవ్వరూ చెట్ల కింద నిలబడరాదని సూచించింది.
ద్రోణి ప్రభావంతో ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
గ్రేటర్ హైదరాబాద్ వర్షంతో తడిసి ముద్దయింది. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మణికొండ, దిల్ సుఖ్ నగర్, యూసఫ్ గూడ, అబిడ్స్, ఖైరతాబాద్, బోరబండ తదితర ప్రాంతాలలో వర్షం పడుతోంది.
కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఏపీలో భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర విలవిల లాడుతోంది. శ్రీకాకుళం జిల్లాకు అధికార యంత్రాంగం రెడ్ అలర్ట్ ప్రకటించింది.
మరోపైపు ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాకు ఆనుకొని ఉన్న గోపాల్పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.