Share News

Rain: దంచి కొట్టిన వాన

ABN , Publish Date - Oct 11 , 2025 | 02:04 AM

జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసాయి.

Rain: దంచి కొట్టిన వాన
గుడిపాల మండలం గోళ్లతిమ్మయ్యకండ్రిగ గ్రామ సమీపంలో కొట్టుకుపోయిన వంతెన

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసాయి. రొంపిచెర్ల మినహా 31 మండలాల్లో వర్షాలు కురిసాయి. అత్యధికంగా శ్రీరంగరాజపురంలో 154.0 మిమీ, నిండ్రలో 140.2 మిమీ వర్షం కురిసింది. రామకుప్పం మండలంలో అత్యల్పంగా 4.8 మిమీ వర్షం మాత్రమే కురవగా...గుడిపాలలో 93, కుప్పంలో 89, నగరిలో 86.2, పూతలపట్టులో 80.2, బంగారుపాళ్యంలో 78.6, చిత్తూరులో 78, బైరెడ్డిపల్లిలో 76.2, యాదమరిలో 64, పాలసముద్రంలో 59.2, పెనుమూరులో 55, గంగాధరనెల్లూరులో 54.2, చిత్తూరు అర్బన్‌లో 46.4, గంగవరంలో 45.6, పుంగనూరులో 42.4, విజయపురంలో 42.2, పలమనేరు, కార్వేటినగరం మండలాల్లో 41.8, పెద్దపంజాణిలో 32.6, చౌడేపల్లిలో 30, గుడుపల్లెలో 28.8, శాంతిపురంలో 26.4, సోమలలో 23.6, పులిచెర్లలో 23.2, తవణంపల్లెలో 20.2, వి.కోటలో 19.4, ఐరాల, సదుంలలో 15.4 మిమీ చొప్పున వర్షపాతం నమోదయ్యింది.దీంతో చలితీవ్రత పెరిగింది. అక్టోబరు నెల జిల్లా సగటు వర్షపాతం 12.7మిమీ కాగా, శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 51.0 మిమీ వర్షం కురవగా, ఈనెల 1వ తేది నుంచి 10వ తేది వరకు 138.7 మిమీ వర్షపాతం నమోదయ్యింది. శనివారం కూడా పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఎస్‌ఆర్‌పురం మండలం కమ్మకండ్రిగ పంచాయతీ పరిఽధిలో గురువారం రాత్రి కురిసిన వానతో మూడు గ్రామాలకు రాకపోకలునిలిచిపోయాయి.పలమనేరు మండలం ముసలిమడుగు వద్ద పంట పొలాల్లో వర్షపునీరు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Oct 11 , 2025 | 02:04 AM