Share News

Rain Alert: భారీ వర్షాలు.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెప్పిందంటే..

ABN , Publish Date - Oct 10 , 2025 | 09:27 PM

ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం నాడు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

Rain Alert: భారీ వర్షాలు.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఏం చెప్పిందంటే..
Rain Alert

విశాఖ: ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం నాడు వర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఆయన పేర్కొన్నారు. దీని ప్రభావంతో శనివారం నాడు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.


ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు, రైతు కూలీలు చెట్ల కిందకు వెళ్లే ప్రయత్నం చేయెుద్దని ప్రఖర్ జైన్ సూచించారు. కాగా, ఇవాళ (శుక్రవారం) సాయంత్రం 5 గంటలకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా నగరంలో 46 మిల్లీమీటర్లు, మలికిపురంలో 36.2 మి.మీ., ప్రకాశం జిల్లా నర్సింగోలులో 27 మి.మీ. వర్షంపాతం నమోదు కాగా.. కాకినాడ జిల్లా డి.పోలవరంలో 25.5 మి.మీ., కోనసీమ జిల్లా అంబాజీపేటలో 21.7 మి.మీ. వర్షపాతం నమోదైందని విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్

హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..

Updated Date - Oct 10 , 2025 | 09:27 PM