Home » Rahul Gandhi
కొందరు తటస్థులు కూడా ఫోన్ చేసి తనకు మద్దతు పలికారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. దేశంలో ఉండే మెజారిటీ ప్రజల అభ్యర్థినని గొప్పగా ఫీల్ అవుతున్న అని హర్షం వ్యక్తం చేశారు. పది రోజుల్లో తాను కూడా రాజకీయాల్లో ముదిరి పోయా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ప్రధాని మోదీ ఇక దేశానికి తన ముఖాన్ని చూపించలేరని విమర్శించారు.
కుంభమేళా తరహాలోనే రాజమండ్రి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఈ పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.
ర్యాలీలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై తేజస్వి విమర్శలు గుప్పించారు. నితీష్ కాపీ క్యాట్ ముఖ్యమంత్రి అని, ఆయన విధానాల్లో అనుకరణే తప్ప ఒరిజినాలిటీ లేదన్నారు. తన విధానాలు, ప్రకటనలను నితీష్ కాపీ కొడుతున్నారని చెప్పారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్న బిహార్ దర్భంగా ఓటర్ అధికార్ యాత్ర సభ వేదికపై నుంచి ప్రధాని మోదీ తల్లిని కొందరు దూషించడంపై కలకలం రేగుతోంది....
దర్భంగా జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని బీజేపీ నాయకుడు కృష్ణ సింగ్ కల్లు ఆరోపించారు. ప్రపంచంలో లేని వ్యక్తి గురించి దుర్భాషలు ఆడటం బాధాకరమన్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇండియా కూటమి తరపున బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు న్యాయంగా జరిగితే, రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతుందని జోస్యం చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై దొంగ ఓట్లతో గత ఎన్నికల్లో గెలిచారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ గెలిచినట్టుగా సాక్షాలు ఉంటే దమ్ముంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ బీహార్‌లో ఓడిపోతుందన్న భయంతోనే దొంగ ఓట్లు అంటూ.. నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
ఓటర్ అధికార్ యాత్ర’లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి.. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.
సాక్ష్యాలు ఉన్నప్పుడు మాత్రమే తాను స్టేట్మెంట్లు ఇస్తానని రాహుల్ అన్నారు. తాను అబద్ధాలు చెప్పనని, వాస్తవాలు తన ముందు ఉన్నప్పుడే ఆ విషయాల గురించి మాట్లాడతానని చెప్పారు.