Home » Putin
ట్రంప్‌తో మీటింగ్ తరువాత పత్రికా సమావేశలో పుతిన్ సడెన్‌గా ఇంగ్లిష్‌లో మాట్లాడి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. దీంతో, పుతిన్‌కు అసలు ఎన్ని భాషలు వచ్చన్న 'సందేహాలు జనాల్లో మొదలయ్యాయి. మరి ఆయన భాషా నైపుణ్యాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య అలస్కాలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం గురించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ భేటీ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శుక్రవారం జరిగిన ఈ సమావేశం సానుకూలం అని ఇద్దరు నాయకులూ ప్రకటించారు. కానీ ఇందులో ఓ ట్విస్ట్ ఉంది.
మరి కాసేట్లో ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ సమావేశంలో ఉక్రెయిన్‌పై చర్చ ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధం ముగింపు కోసం పుతిన్‌ను చర్చలకు కూర్చోబెట్టాలనేదే తన ప్రధాన ఉద్దేశమని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధం ముగిసే వరకూ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు కూడా ఉండవని పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు ఆగస్టు 15న అలాస్కాలో స్పెషల్ మీటింగ్‌లో కలువనున్నారు. ఈ సమావేశం చాలా కీలకం, ఎందుకంటే ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే దిశగా ఒక కీలక నిర్ణయం కావచ్చు. ఈ భేటీలో ఏం జరగబోతోంది? పుతిన్ ఏం కోరుకుంటున్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ గురించి కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం పరిష్కారం కోసం ఆగస్టు 15, 2025న అలస్కాలో సమావేశం కానున్నట్లు వెల్లడించారు.
రష్యా చమురు కొనుగోలు చేయవద్దన్న తన మాట వినడం లేదంటూ భారత్‌పై ఒంటికాలిపై లేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మున్ముందు ఇంకా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.
మాస్కోపై తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్న ట్రంప్.. ఉక్రెయిన్‌కు ఆయుధాలు అంజేస్తామని వెల్లడించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల పంపిణీని నాటో సమన్వయం చేస్తుందన్నారు. రష్యా చర్చలకు రాకపోవడంపై ట్రంప్ అంసతృప్తి వ్యక్తం చేయడం కొత్త కూడా కాదు.
రష్యా 50 రోజుల్లోగా ఉక్రెయిన్‌తో యుద్ధవిరమణ ఒప్పందం కుదుర్చుకోకపోతే భారీ ఎత్తున సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలపై రష్యా ఘాటుగా స్పందించింది. ట్రంప్ బెదిరింపులకు లొంగమని..
ఇరాన్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) శనివారం ముప్పేట దాడులు చేసింది. ఇస్ఫహాన్ అణ్వాయుధ కేంద్రంలోని రెండు సెంట్రీఫ్యూజ్ యూనిట్లను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించగా.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత చొరవతోనే ఆగిందని రష్యా పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ బుధవారం ఫోన్లో జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపింది.