Share News

Donald Trump: రష్యా విషయంలో కీలక పురోగతి.. ట్రంప్ వెల్లడి

ABN , Publish Date - Aug 17 , 2025 | 09:32 PM

ట్రంప్, పుతిన్ గత శుక్రవారంనాడు అలాస్కాలోని ఎయిర్ బేస్ వద్ద సమావేశమయ్యారు. మూడు గంటల సేపు ఈ సమావేశం జరిగింది. సమావేశానంతరం ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడనప్పటికీ చర్చల్లో పురోగతి ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు.

Donald Trump: రష్యా విషయంలో కీలక పురోగతి.. ట్రంప్ వెల్లడి
Putin and Donald Trump

వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ (Vladimir Putin)తో అలాస్కా సమావేశం ముగిసిన కొద్ది గంటలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా విషయంలో కీలక పురోగతి సాధించామని, ఆ విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.


ట్రంప్, పుతిన్ గత శుక్రవారంనాడు అలాస్కాలోని ఎయిర్ బేస్ వద్ద సమావేశమయ్యారు. మూడు గంటల సేపు ఈ సమావేశం జరిగింది. సమావేశానంతరం ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడనప్పటికీ చర్చల్లో పురోగతి ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. తదుపరి సమావేశంలో మాస్కోలో ఉండవచ్చని పుతిన్ మీడియా ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


కాగా, ఉక్రెయిన్‌కు నాటో తరహా భద్రతా గ్యారెంటీని అమెరికా, ఐరోపో మిత్రదేశాలు అందించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ఆదివారం వెల్లడించారు. చర్చల్లో ఇదే గేమ్ ఛేంజర్‌గా మారనుందన్నారు. ఉక్రెయిన్‌లోని అదనపు భూభాగాల్లోకి వెళ్లకుండా చట్టబద్ధమైన హామీ ఇస్తామని రష్యా చెప్పినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌సీ యూరోపియన్ నేతలతో కలిసి సోమవారంనాడు వాషింగ్టన్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు.


ఇవి కూడా చదవండి..

అమెరికాతో వాణిజ్య చర్చలు వాయిదా.. భారత్‌పై 50 శాతం సుంకం తప్పదా..

న్యూయార్క్ రెస్టారెంట్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 09:41 PM