Share News

Trade Talks Postponed: అమెరికాతో వాణిజ్య చర్చలు వాయిదా.. భారత్‌పై 50 శాతం సుంకం తప్పదా..

ABN , Publish Date - Aug 17 , 2025 | 08:56 PM

అమెరికా భారత్ మధ్య ఆగస్టు 25న జరగాల్సిన వాణిజ్య చర్చలు వాయిదా పడినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీంతో, తదుపరి ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది.

Trade Talks Postponed: అమెరికాతో వాణిజ్య చర్చలు వాయిదా.. భారత్‌పై 50 శాతం సుంకం తప్పదా..
India US Trade Talks Postponed

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై అమెరికా సుంకాల విధింపు విషయంలో సస్పెన్స్ కొనసాగుతున్న వేళ తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య ఆగస్టు 25న జరగాల్సి ఆరో విడత వాణిజ్య చర్చలు వాయిదా పడినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మళ్లీ మీటింగ్ ఎప్పుడనేది త్వరలో నిర్ణయిస్తారని సమాచారం. ఆగస్టు 27 నుంచి భారత్‌పై 50 శాతం సుంకం విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుంకాల బాదుడు తప్పదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, సుంకాల విధింపులో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పూ లేదట. ట్రంప్-పుతిన్ భేటీ తరువాత కూడా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో అమెరికా వైఖరిలో మార్పు రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


అయితే, రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించిన 25 శాతం సుంకం తొలగింపు కోసం తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం కూడా చర్చలు జరుగుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. టారిఫ్‌లు సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలోనే ఇరు దేశాల మధ్య ఈ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

పుతిన్‌తో భేటీ తరువాత ట్రంప్.. రెండో దశ ఆంక్షలు వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తానని పేర్కొన్నారు. అయితే, 25 శాతం పెనాల్టీ సుంకంపై మాత్రం అమెరికా ఆలోచన మారలేదని సమాచారం.


ఇవి కూడా చదవండి:

న్యూయార్క్ రెస్టారెంట్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి

యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధమే.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2025 | 09:03 PM