Share News

Putin language Skills: ట్రంప్‌తో చర్చలు.. రష్యన్‌లోనే మాట్లాడిన పుతిన్.. ఆయనకు అసలెన్ని భాషలు వచ్చంటే..

ABN , Publish Date - Aug 16 , 2025 | 09:36 PM

ట్రంప్‌తో మీటింగ్ తరువాత పత్రికా సమావేశలో పుతిన్ సడెన్‌గా ఇంగ్లిష్‌లో మాట్లాడి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. దీంతో, పుతిన్‌కు అసలు ఎన్ని భాషలు వచ్చన్న 'సందేహాలు జనాల్లో మొదలయ్యాయి. మరి ఆయన భాషా నైపుణ్యాల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

Putin language Skills: ట్రంప్‌తో చర్చలు.. రష్యన్‌లోనే మాట్లాడిన పుతిన్.. ఆయనకు అసలెన్ని భాషలు వచ్చంటే..
Vladimir Putin English fluency

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య తాజాగా మూడు గంటల పాటు సాగిన చర్చలు ఎటూ తేలకుండా ముగిశాయి. కాల్పుల విరమణ గురించి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే, చర్చలపై ఇరు నేతలు నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఇక ఈ మీటింగ్‌కు సంబంధించి అనేక అంశాలపై ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పుతిన్ ట్రంప్‌తో రష్యన్ భాషలోనే మాట్లాడటం, పత్రికా సమావేశంలో మాత్రం సడెన్‌గా ఇంగ్లిష్‌లో మాట్లాడటం కొందరికి ఆసక్తి కలిగించింది. నెట్టింట కొందరు పలు అనుమానాలను పంచుకున్నారు. పుతిన్‌కు అసలు ఎన్ని భాషలు వచ్చు అనే సందేహాలను వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, పుతిన్‌కు ఇంగ్లిష్‌పై మంచి పట్టు ఉంది. కానీ బహిరంగంగా లేదా అధికారిక సమావేశాల్లో ఆయన రష్యన్ భాషలోనే మాట్లాడుతారు. ఇలాంటి సందర్భాల్లో అనువాదకుల సాయం తీసుకుంటారు. పత్రికా సమావేశాల్లో కూడా ఆయన ఇదే రీతిలో వ్యవహరిస్తారు. అయితే, అంతర్గత సమావేశాల్లో మాత్రం ఆయన అప్పుడప్పుడూ ఇంగ్లిష్‌లో మాట్లాడతారని రష్యా ప్రభుత్వ ప్రతినిధి ఓ సందర్భంలో తెలిపారు. కొన్ని సందర్భాల్లో అనువాదకుల తప్పులను కూడా ఆయన సరిదిద్దుతారని అన్నారు. అయితే, మాతృభాషలో మాట్లాడేందుకు ట్రంప్ సౌకర్యంగా భావిస్తారని, అందుకే అనువాదకుల సాయం తీసుకుంటారని తెలిసింది.


పుతిన్‌కు రష్యా భాషతో పాటు జర్మన్ భాషపై కూడా మంచి పట్టు ఉంది. 1980ల్లో తూర్పు జర్మనీలో నిఘా అధికారిగా ఉన్న సమయంలో ఆయన జర్మన్‌ భాషను నేర్చుకున్నారు. గతంలో జర్మనీ ఛాన్సలర్‌తో దౌత్యపరమైన చర్చల్లో ఆయన జర్మనీలో మాట్లాడారు.

ఇక ట్రంప్‌తో చర్చల తరువాత పత్రికా సమావేశంలో పుతిన్ అకస్మాత్తుగా ఇంగ్లిష్‌లో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా యుద్ధంపై మాట్లాడిన ట్రంప్.. తాను తక్షణ కాల్పుల విరమణను ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో ట్రంప్‌తో చర్చించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం అమెరికాకు వెళ్లనున్నారు.


ఇవి కూడా చదవండి:

యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధమే.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన

ఇలాగైతే భారత్‌పై యుద్ధం మినహా పాక్‌కు మరో మార్గం ఉండదు: బిలావల్ భుట్టో హెచ్చరిక

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 16 , 2025 | 10:14 PM