Share News

Putin Motorcycle Gift: పుతిన్ అంటే ఇదీ.. ఈ అమెరికా వ్యక్తికి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూస్తే

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:53 PM

ట్రంప్‌తో అలాస్కాలో సమావేశం సందర్భంగా పుతిన్ స్థానికుడు ఒకరికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా రూ.19 లక్షలు ఖరీదు చేసే రష్యా బైక్‌ను బహుమతిగా ఇచ్చారు.

Putin Motorcycle Gift: పుతిన్ అంటే ఇదీ.. ఈ అమెరికా వ్యక్తికి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూస్తే
Putin Alaska motorcycle gift

ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ అమెరికా వ్యక్తికి ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. రష్యాలో తయారైన బైక్‌ను బహుమతిగా ఇవ్వడంతో సదరు అమెరికా వ్యక్తి ఆనందానికి అంతేలేకుండా పోయింది. ఇటీవలి పుతిన్, ట్రంప్ అలాస్కాలో సమావేశమైన సందర్భంగా ఈ ఘటన జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, పుతిన్ కంటే ముందు ఓ రష్యా బృందం అలాస్కాకు వచ్చింది. ఆ బృందంలో ఓ టీవీ ఛానల్ వారు కూడా ఉన్నారు. ఆ సమయంలో మార్క్ వారెన్ అనే వ్యక్తి అరల్ గేర్ అప్ అనే రష్యన్ మోటర్ సైకిల్‌పై దూసుకుపోతూ కనిపించారు. తన రోజువారీ పనులపై ఆయన బైక్ ‌నడుపుతూ వెళుతుండగా వారి కంటపడ్డారు. రష్యా బైక్ అమెరికాలో కనిపించడంతో ఆశ్చర్యపోయిన టీవీ బృందం సభ్యులు మార్క్‌ను ఇంటర్వ్యూ చేశారు.

ఈ సందర్భంగా బైక్ గురించి మార్క్ చెప్పుకొచ్చారు. అది తనకు ఇష్టమైన బైక్ అని, కానీ పాతబడిపోయిందని తెలిపాడు. దాని విడిభాగాలు కూడా అమెరికాలో దొరకట్లేదని అన్నాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ తరువాత కొన్ని రోజులకు మార్క్‌కు రష్యా దౌత్య బృందం నుంచి కబురు అందింది. మరో కొత్త బైక్ బహుమతిగా ఇవ్వనున్నట్టు వారు చెప్పారు. కానీ మార్క్ మాత్రం నమ్మలేదు. ఇదేదో ప్రాంక్ కాల్ అయి ఉంటుందని అనుకున్నాడు.


కానీ పుతిన్, ట్రంప్ మీటింగ్ ముగియానే రష్యన్ బృందం మరోసారి మార్క్‌ను సంప్రదించింది. తాము ఉంటున్న హోటల్ వద్ద అతడికి బైక్‌ను బహూకరించింది. ఇది పుతిన్ వ్యక్తిగత బహుమతి అని చెప్పి మరీ బైక్ తాళాలు ఇచ్చింది. దీంతో మార్క్ ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. ‘నేను నోరెళ్లబెట్టాడు. ఏం ఇది నిజంగానేనా.. అంటూ తెల్లముఖం వేశా’ అని ఆ రోజున జరిగిన విషయాన్ని మార్క్ గుర్తు చేసుకున్నారు.

అంతకురెండు రోజుల ముందే బైక్‌ను తయారు చేసిన అమెరికాకు పంపించినట్టు తనకు రిజిస్ట్రేషన్‌ పేపర్లు చూడగానే అర్థమైందని అన్నాడు. అది తన కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన బైక్ అంటూ మురిసిపోయాడు. రష్యా బృందానికి ధన్యవాదాలు కూడా తెలిపారు. మార్క్ గతంలో అగ్నిమాపక సిబ్బందిగా పని చేసి రిటైర్ అయ్యారు. మరి ఈ బైక్ ఖరీదు ఎంతటి అంటారా? అక్షరాలా రూ.19 లక్షలు.


ఇవీ చదవండి:

భారత్‌లో నిరుద్యోగం పెరగడానికి అధిక ప్రభుత్వ శాలరీలే కారణం.. ఆర్థికవేత్త స్టేట్‌మెంట్

విమానం కాక్‌పిట్‌లో పైలట్‌ల రొమాన్స్.. సంచలన విషయాలు బయటపెట్టిన ఎయిర్‌హోస్టెస్

Read Latest and Viral News

Updated Date - Aug 21 , 2025 | 01:43 PM