Home » Putin
ఎస్‌సీఓ కాన్ఫరెన్స్ వేదిక నుంచి ద్వైపాక్షిక సమావేశం జరుగనున్న రిట్జ్-కార్లటన్ హోటల్ వరకూ మోదీతో కలిసి ప్రయాణించాలని అధ్యక్షుడు పుతిన్ అనుకున్నారని, మోదీ కోసం 10 నిమిషాల పాటు వేచి చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
షాంఘై సహకార సదస్సు కోసం చైనాలోని తియాన్‌జిన్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సరదాగా గడిపారు. పుతిన్‌ను కౌగిలించుకుని, ఆయన చేతిలో చేయి వేసి పట్టుకుని నవ్వుతూ మాట్లాడారు. ఇదే సమావేశానికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు.
చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు దర్శనమిచ్చాయి. మోదీ, పుతిన్ కలుసుకోగానే హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు.
చైనాలో ప్రాంతీయ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ సోమవారంనాడు చర్చలు జరుపుతామని క్రెమ్లిన్ అధికారి యూరి ఉషకోవ్ తాజాగా తెలిపారు. ఈ సమావేశంలో పుతిన్ డిసెంబర్ పర్యటనకు సంబంధించిన సన్నాహకాలపై ఉభయ నేతలు చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాస్కోలో సమావేశమయ్యారు. ఈ భేటీ భారత్-రష్యా సంబంధాల్లో మరింత బలాన్ని తీసుకురావడంలో కీలకంగా మారింది.
ట్రంప్‌తో అలాస్కాలో సమావేశం సందర్భంగా పుతిన్ స్థానికుడు ఒకరికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా రూ.19 లక్షలు ఖరీదు చేసే రష్యా బైక్‌ను బహుమతిగా ఇచ్చారు.
త్వరలో పుతిన్, జెలెన్స్కీ భేటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని అన్నారు. శాంతి స్థాపన దిశగా ఇది తొలి అడుగని కూడా వ్యాఖ్యానించారు.
మోదీకి పుతిన్ ఫోన్ చేసిన విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 2022 ఫిబ్రవరి నుంచి రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై భారత వైఖరిని ప్రధాని పునరుద్ఘాటించారని, శాంతియుత తీర్మానం చేసుకోవాలని ప్రధాని సూచించారని, దీనికి సంబంధించి తాము కూడా అన్నివిధాలుగా మద్దతిస్తామని చెప్పారని తెలిపింది.
పుతిన్ విదేశీ పర్యటనల్లో తన ఆరోగ్య పరిస్థితి బయట ప్రపంచానికి తెలియకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారని అడపాదడపా కథనాలు వస్తుంటాయి. ఇప్పుడు మరోసారి అలాంటి కథనాలే వెలుగుచూశాయి.
ట్రంప్, పుతిన్ గత శుక్రవారంనాడు అలాస్కాలోని ఎయిర్ బేస్ వద్ద సమావేశమయ్యారు. మూడు గంటల సేపు ఈ సమావేశం జరిగింది. సమావేశానంతరం ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడనప్పటికీ చర్చల్లో పురోగతి ఉందని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు.