Modi Greets Putin: పుతిన్‌కు మోదీ ఫోన్.. ఎందుకంటే
ABN , Publish Date - Oct 07 , 2025 | 07:51 PM
ఇండియా-రష్యా 23వ వార్షిక సదస్సుకు పుతిన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానిస్తూ, ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నట్టు తెలియజేశారు. భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ డిసెంబర్ 5-6 తేదీల్లో ఇండియాకు రానున్నారు.
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ (Vladimir Putin)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారంనాడు ఫోన్ చేశారు. పుతిన్ 73వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చిరకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. వ్యక్తిగతంగా తమ మధ్య ఉన్న స్నేహం, ఇరుదేశాల పటిష్ట ద్వైపాక్షిక సంబంధాలపై కూడా ఉభయూలూ మాట్లాడుకున్నారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు పునరుద్ధాటించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఇంధనం, రక్షణ, అంతరిక్ష సహకారం, ఇరుదేశాల ప్రజల మధ్యనున్న మైత్రీ సంబంధాలపై ఉభయ నేతలు చర్చించారు. న్యూక్లియర్ ఎనర్జీ, రక్షణ పరిశ్రమల భాగస్వామ్యం సహా పలు వ్యూహాత్మక ప్రాజెక్టులు ఊపందుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇండియా-రష్యా వార్షిక సదస్సు
ఇండియా-రష్యా 23వ వార్షిక సదస్సుకు పుతిన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానిస్తూ, ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నట్టు తెలియజేశారు. భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ డిసెంబర్ 5-6 తేదీల్లో ఇండియాకు రానున్నారు. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో పుతిన్ ఇండియా పర్యటనకు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో మోదీ, పుతిన్ రెండుసార్లు సమావేశమయ్యారు. కజాన్‌లో జూలైలో జరిగిన బ్రిక్స్ సదస్సులోనూ, చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులోనూ ఉభయనేతలు భేటీ అయ్యారు.
ఇవి కూడా చదవండి..
ఎయిరిండియా ప్రమాదంపై పారదర్శకంగా దర్యాప్తు.. రామ్మోహన్ నాయుడు
ఏడాది తర్వాత కేజ్రీవాల్‌కు ప్రభుత్వ బంగ్లా కేటాయింపు
Read Latest Telangana News and National News