Share News

PM Modi and Putins: చైనాలో ప్రధాని మోదీ, పుతిన్ హృదయపూర్వక ఆలింగనం

ABN , Publish Date - Sep 01 , 2025 | 09:42 AM

చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు దర్శనమిచ్చాయి. మోదీ, పుతిన్ కలుసుకోగానే హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు.

PM Modi and Putins:  చైనాలో ప్రధాని మోదీ, పుతిన్ హృదయపూర్వక ఆలింగనం
PM Modi and Putin

ఇంటర్నెట్ డెస్క్: చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు దర్శనమిచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలుసుకోగానే హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్ చైనాలోని టియాంజిన్‌లో చర్చలు జరిపారు.


పుతిన్‌తో భేటీ విషయాన్ని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రష్యాతో చమురు కొనుగోళ్లను బూచీగా చూపి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత దిగుమతులపై 50% సుంకాలను విధించిన నేపథ్యంలో ఈ ఇద్దరు అగ్ర నాయకుల మధ్య కీలక సమావేశం జరిగింది.


జులైలో ఉక్రెయిన్‌పై శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే రష్యాపై 100% సుంకాలను విధించాలని కూడా ట్రంప్ బెదిరించారు. రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాలపై జరిమానాలు కొనసాగిస్తానని కూడా ఆయన చెప్పారు. ఉక్రెయిన్ పరిస్థితిని చర్చించడానికి ట్రంప్, పుతిన్ అలాస్కాలో కలిసిన దాదాపు వారం రోజల తర్వాత ప్రధాని మోదీ, పుతిన్ మధ్య తాజా సమావేశం జరిగింది.


ఇవి కూడా చదవండి

వర్షంలో ఆడుతుండగా ఊహించని సంఘటన.. గ్రౌండ్‌లో పడ్డ పిడుగు..

నాటిన చెట్లలో బతికున్న వాటికే గ్రీన్‌ క్రెడిట్స్‌

Updated Date - Sep 01 , 2025 | 11:43 AM