Lightning Strikes College Ground: వర్షంలో ఆడుతుండగా ఊహించని సంఘటన.. గ్రౌండ్‌లో పడ్డ పిడుగు..
ABN , Publish Date - Sep 01 , 2025 | 06:47 AM
కొంతమంది యువకులు వర్షంలో తడుస్తూనే కాలేజీ గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఉన్నారు. వర్షపు నీళ్లలో అటు, ఇటు గెంతుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్: ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా పలుచోట్ల పిడుగులు సైతం పడుతున్నాయి. తాజాగా, ఓ కాలేజీ గ్రౌండ్‌లో పిడుగుపడింది. అది కూడా యువకులు ఆడుకుంటూ ఉండగా వారికి అడుగుల దూరంలో పిడుగు పడింది. దీంతో వారు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బస్తీలో కిషన్ డిగ్రీ కాలేజీ ఉంది.
నిన్న ఆదివారం సెలవు కావడంతో కొంతమంది యువకులు కాలేజీ గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఉన్నారు. ఉదయం నుంచి వర్షం పడుతున్నా లెక్కచేయకుండా అలాగే ఆడుకుంటున్నారు. వర్షపు నీళ్లలో అటు, ఇటు గెంతుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. యువకులకు కొన్ని అడుగుల దూరంలో ఓ పిడుగు పడింది. పెద్ద బాంబు పేలినట్లు భారీ శబ్ధం వచ్చింది. దీంతో యువకులు భయపడిపోయారు. అక్కడినుంచి పరుగులు పెట్టారు. స్థానికులు పిడుగుపాటుపై మాట్లాడుతూ.. పిడుగు పడ్డ తర్వాత ఓ రకమైన వాసన వచ్చిందని అన్నారు.
ఆ వాసన చాలా ఘాటుగా ఉందని చెప్పారు. ఇక, యువకులు స్పందిస్తూ.. ‘మేము చెట్టుకు కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నాము. మా అదృష్టం బాగుండి ప్రాణాలతో బతికి బయటపడ్డామని’ అన్నారు. ఓ యువకుడు పిడుగుపాటుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీశాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘చెట్టుకు కొంచెం దగ్గర ఉంటే గుంపు, గుంపు మొత్తం ప్రాణాలు కోల్పోయేది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అత్తయ్య ఆదర్శంగా దేశం గర్వించేలా