Home » Pulivendula
అధికారంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికపై రాష్ట్రమంతా ఆసక్తి నెలకొంది. ఆగస్టు 12న పోలింగ్ జరగనుండగా.. ఇవాళ్టితో(ఆదివారం) ప్రచారానికి తెరపడింది. దీంతో తెరవెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి.
Pulivendula ZPTC Polls: పులివెందులలో ఓటుకోసం ఎంత డబ్బైనా ఇచ్చేందుకు వైసీపీ సిద్దమైంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ బెంగళూరు కేంద్రంగా వ్యూహరచన చేస్తున్నారు. ఒక్కో ఓటు కోసం ఏకంగా 10 వేల రూపాయలు పైనే ఇవ్వడానికి సిద్దమైనట్లు సమాచారం.
పులివెందులలో ఇప్పుడు ధర్మానికి, అధర్మానికి సమరం జరుగుతోందని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. రాష్ట్రమంతా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక వైపే చూస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో పులివెందుల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు చించడం వైసీపీ నాయకుల అవివేకానికి నిదర్శనమని మంత్రి సవిత విమర్శించారు. పోలీసులను అసభ్యకరంగా మాట్లాడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైసీపీ నాయకులు పులివెందుల ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు పేర్కొన్నారు.
పులివెందులలో వైసీపీ గత రెండు రోజులుగా చేస్తున్న హడావుడి చూస్తే ఎన్నికలబరి నుంచి తప్పుకునేందుకు తాపత్రయం పడుతున్నట్లు స్పష్టమవుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పులివెందులలో ఎమ్మెల్సీ ఆయన ఇంటి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
పులివెందుల, ఒంటి మిట్టలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు కట్టుదిట్ట భద్రత మధ్య నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తెలిపారు. కడప పెన్నార్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
జడ్పీటీసీ ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్ప వని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ హెచ్చరించారు. డీఎస్పీ తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
పులివెందుల నియోజకవర్గ మంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట అని చెబు తుంటారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబాన్ని పులివెందుల నియోజకవర్గం ఆదరి స్తూ వస్తోంది.
పులివెందుల జడ్పీటీసీని కూటమి నేతలంతా కలిసి ఒక సంకల్పంతో గెలుచుకుని రావాలని.. తాను పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు.
ABN Effect: పులివెందుల పోలీసుల సెటిల్‌మెంట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.