Share News

By-elections: పులివెందుల ఎన్నిక.. ఏకపక్షం కాదు..

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:30 PM

పులివెందుల నియోజకవర్గ మంటే వైఎస్‌ కుటుంబానికి కంచుకోట అని చెబు తుంటారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి వైఎస్‌ కుటుంబాన్ని పులివెందుల నియోజకవర్గం ఆదరి స్తూ వస్తోంది.

By-elections: పులివెందుల ఎన్నిక.. ఏకపక్షం కాదు..

- హోరాహోరీగా ప్రచారాలు

- టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ

- ముఖ్య నేతలంతా అక్కడే తిష్ఠ

జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు(ZPTC by-elections) అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న ఎన్నిక జరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జిల్లాలో ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ సీఎం జగన్‌ సొంత జిల్లా కావడంతో వీటిపై రాష్ట్రమంతటా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పులివెందుల ఎన్నిక హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈసారి ఈ ఎన్నిక వైఎస్‌ కుటుంబానికి ఏకపక్షం కాదని అంటున్నారు. అందుకు తగ్గట్లుగానే టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నువ్వా, నేనా అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముఖ్యనేతలంతా ఇక్కడే తిష్ఠ వేశారు.

(కడప-ఆంధ్రజ్యోతి): పులివెందుల నియోజకవర్గ మంటే వైఎస్‌ కుటుంబానికి కంచుకోట అని చెబు తుంటారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి వైఎస్‌ కుటుంబాన్ని పులివెందుల నియోజకవర్గం ఆదరి స్తూ వస్తోంది. ఇక్కడ ప్రతి ఎన్నికా హింసాత్మకం గా సాగుతోందనే విషయం చరిత్ర చూస్తే తెలు స్తుంది. అయితే పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు కూడా టీడీపీని ఆదరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగితే నచ్చిన పార్టీకి ఓటుతో తీర్పు చెబుతామని పులివెందుల నియోజకవర్గ ప్ర జలు గతంలో నిరూపించారు. 1983లో టీడీపీ ఆవి ర్భవించిన తరువాత ఆ పార్టీకి కూడా నియోజక వర్గంలో చెక్కుచెదరని ఓటు బ్యాంకు ఉంది. దివంగత వైఎస్‌, జగన్‌ సునామీలో కూడా ఆ పార్టీ ఓటు బ్యాంకు అలాగే కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు పులివెందులలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్లీ పులివెందులపై రాజకీయ చర్చ నడుస్తోంది.


పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థా నాలకు ఈనెల 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. పులవెందులలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి సతీమణి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. వైఎస్‌ కుటుంబం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్నా కత్తిమీద సాముగా ఉన్నట్లు చెబుతారు. జగన్‌ హయాంలో నామినేషన్లు వేసే సమయంలోనే రణరంగంగా మారింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అందరూ స్వేచ్ఛగా నామినేషన్లు వేశారు. 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.


పులివెందుల రసవత్తరం

పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ కుటుంబాన్ని జనం ఆదరిస్తూ వస్తున్నప్పటికీ లోకల్‌బాడీలో టీడీపీ అభ్యర్థులను కూడా ఓట్లు వేసి గెలిపించు కున్నారు. 1995లో జరిగిన జడ్పీటీసీ, మండల పరి షత్‌ ఎన్నికల్లో వేముల, వేంపల్లె, లింగాల జడ్పీటీసీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. అలాగే వేముల, వేంపల్లె మండల పరిషత్‌ స్థానాలను కూడా కైవ సం చేసుకుంది. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నిక ల నేపథ్యంలో వరుసగా జరుగుతున్న పరిణామా లు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి.


puli1.jpg

పులివెం దుల జడ్పీటీసీకి ఆరు గ్రామ పంచాయతీల పరిధి లో 10,400 ఓట్లు ఉన్నాయి. వైసీపీలో బలమైన టీడీపీ నేతలందరూ వరుసగా టీడీపీ గూటికి చేరు తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 2,166 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి 5,955 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఉప ఎన్నికల నేపథ్యం లో పలువురు వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం, అధికారపార్టీ కావడంతో టీడీపీ బలపడుతూ వస్తోంది. దీంతో ఈ ఎన్నిక ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ, వైసీపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.


ఎంపీ అవినాశ్‌రెడ్డి వైసీపీ గెలుపు బాధ్యతలను భుజస్కంధాలపై వేసుకున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఇతర టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఇటీవల జరిగిన వరుస పరిణామాలతో పులివెందుల ఎన్నిక తారాస్థాయికి చేరింది. ఇది ఒకరి అడ్డా కాదు అంటూ గతంలో టీడీపీ గెలుచుకున్న వైనాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. మొత్తానికి పులివెందుల పోరు రసవత్తరంగా మారుతోంది.


ఒంటిమిట్టలో నువ్వా నేనా..

ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అంటూ ముందుకు పోతున్నాయి. టీడీపీ నుంచి అద్దలూరు ముద్దుక్రిష్ణారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ తమ అభ్యర్థిని ముందుగానే ఖరారు చేసింది. దీంతో కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఒక విడత ఇంటింటి ప్రచారాన్ని పూర్తిచేశారు. టీడీపీ ఆలస్యంగా అభ్యర్థిని ఖరారు చేసింది. శుక్రవారం నుంచి టీడీపీ ప్రచారం ముమ్మరం చేయనుంది.


గురువారం సాయంత్రం మంత్రులు బీసీ జనార్ధనరెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఒంటిమిట్టలో నేతలతో సమావేశమై గెలుపు వ్యూహంపై చర్చించారు. ఇక్కడ మొత్తం 24,606 ఓట్లు ఉన్నాయి. 13 గ్రామ పంచాయతీలున్నాయి. బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక టీడీపీ మండలాన్ని ఆరు యూనిట్లుగా విభజించి నేతలకు బాధ్యతలు అప్పజెప్పింది. వైసీపీ రెండో విడత ప్రచారాన్ని మొదలు పెట్టనుంది. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి ప్రచార బాఽధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్‌ దగ్గరపడడంతో ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..

ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అరుదైన గుర్తింపు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 08 , 2025 | 12:30 PM