Kadapa: ఎమ్మెల్సీ భూమిరెడ్డి సంచలన కామెంట్స్.. వైసీపీ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తోంది
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:53 PM
పులివెందులలో వైసీపీ గత రెండు రోజులుగా చేస్తున్న హడావుడి చూస్తే ఎన్నికలబరి నుంచి తప్పుకునేందుకు తాపత్రయం పడుతున్నట్లు స్పష్టమవుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పులివెందులలో ఎమ్మెల్సీ ఆయన ఇంటి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
- ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి
పులివెందుల: పులివెందులలో వైసీపీ గత రెండు రోజులుగా చేస్తున్న హడావుడి చూస్తే ఎన్నికలబరి నుంచి తప్పుకునేందుకు తాపత్రయం పడుతున్నట్లు స్పష్టమవుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి(MLC Bhumireddy Ramgopal Reddy) పేర్కొన్నారు. గురువారం పులివెందులలో ఎమ్మెల్సీ ఆయన ఇంటి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్లగొండువారిపల్లెలో బుధవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడానికి కారణం వైసీపీనే అన్నారు.
ఎన్నికల సమయంలో పోలీసులు ఎన్నికల నియ మావళి ప్రకారం ఇంటింటి ప్రచారం చేసుకునేందుకు ఆయా గ్రామాలను ఎప్పుడెప్పుడు ఏఏపార్టీ ప్రచారం చేసు కోవాలో పోలీసులు సమయాన్ని కేటాయిస్తారు. అందులో భాగంగానే బుధవారం టీడీపీ నల్లగొండువారిపల్లెలో ప్రచారం చేయాల్సి ఉంది. కానీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ, కొంత మంది నాయకులు నల్లగొండువారిపల్లెకు వెళ్లి మా పార్టీకి చెందిన వారితో రెచ్చగొట్టే విధంగా దురుసుగా ప్రవర్తించారన్నారు. దీంతో ఇరువర్గాలకు గాయాలయ్యాయన్నారు.
అలాగే మంగళవారం సురేష్‌రెడ్డి (సైదాపురం చంటి) జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారంటే అది వైసీపీకి గానీ, టీడీపీకి గానీ ప్రత్యర్థిగానే భావించాలన్నారు. అలాంటిది టీడీపీ వారు అతనిపై దాడి చేశారనడం సరైందికాదన్నారు. సైదాపురం చంటికి గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ఈ సమస్యల వలనే ఈ దాడి జరగి ఉంటుందని స్పష్టమవు తోందన్నారు. కానీ దీన్ని కూడా టీడీపీవారే దాడి చేశారనడం ఎంత వరకు సబబు అన్నారు.
రాచమల్లు ప్రసాదరెడ్డి వచ్చీ రాగానే ఓ స్ర్కిప్టు ప్రకారం వ్యవహారం నడుపుతున్నారన్నారు. కావాలనే ఉద్రిక్తత పరిస్థితులు వచ్చేలా రెచ్చగొట్టే కార్యక్రమాలకు దిగుతున్నారన్నారు. ఎన్నికల కోడ్ ఉన్న వందలాది మందిని తీసుకొని ఎంపీ అవినాశ్‌రెడ్డి తదితరులు పట్టణంలో ర్యాలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. బుధవారం రాత్రి ఇ.కొత్తపల్లెకు చెందిన బాల గంగిరెడ్డి అనే వ్యక్తి టీడీపీకి చెందిన రాజాపై దాడి చేయడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అరుదైన గుర్తింపు
Read Latest Telangana News and National News