Share News

Police: పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:56 PM

జడ్పీటీసీ ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్ప వని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌ హెచ్చరించారు. డీఎస్పీ తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

Police: పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

- ఘర్షణపై ఇరువర్గాలకు చెందిన 66 మందిపై కేసు నమోదు

- అనుమతి లేని ర్యాలీ చేసిన 150 మందిపైనా..

- 200 మంది బైండోవర్‌

- పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌

పులివెందుల(కడప): జడ్పీటీసీ ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్ప వని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్‌(Pulivendula DSP Murali Nayak) హెచ్చరించారు. గురువారం డీఎస్పీ తన కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. పులివెందుల ప్రాంతంలో ఎన్నికలు అంటే కొంత ఉద్రిక్త పరిస్థి తులు ఉంటాయని అందరికీ తెలుసన్నారు. ఎటు వంటి అవాంఛనీయ సంఘటనకు పాల్పడినా ఉపేక్షించమన్నారు. పులివెందుల సబ్‌ డివిజన్‌ పరిధిలో ఇప్పటికి 200 మందిపై బైండోవర్‌ కేసు లు నమోదు చేశామన్నారు.


ట్రబుల్‌మాంగర్స్‌, రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బుధవారం నల్లగొండువారిపల్లెలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారి తీసిందన్నారు. వైసీపీ నాయకులైన వేల్పుల రా మలింగారెడ్డి, హేమాద్రిరెడ్డి మరికొంతమంది మారణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడ్డా రని, కులం పేరుతో దూషించారని టీడీపీ నా యకుడు నల్లగొండువారిపల్లెకు చెందిన ధనుంజయ్‌ ఫిర్యాదు చేయడంతో 50 మందిపై కేసు నమోదు చేశామన్నారు.


అలాగే వేల్పుల రామలింగారెడ్డి ఫి ర్యాదు మేరకు జయభరత్‌రెడ్డి, అక్కులగారి విజయ్‌, కిరికిరి బాష, సత్యంరెడ్డి, శేషారెడ్డితో పాటు మొత్తం 16మందిపై కేసు నమోదు చేశామన్నా రు. బుధవారం సాయంత్రం కడప ఎంపీ అవి నాశ్‌రెడ్డి, వేంపల్లె సతీశ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌, చిన్నప్ప తదితరులు జనసమీకరణ చేసుకుని ప్రజారవాణాకు ఇబ్బంది కలిగిస్తూ, పో లీసులపై నినాదాలు చేసుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా వచ్చారన్నారు.


kadapa1.2.jpg

ఎన్నికల కోడ్‌ ఉల్లం ఘించడంతో 150మందిపై ఎంపీడీవో కృష్ణమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. రెండు రోజులక్రితం తుమ్మలపల్లెకు చెందిన మం డల ఉపాధ్యక్షుడు విశ్వనాథరెడ్డి టీడీపీలో చేరిన సందర్భంగా తనను బెదిరించారంటూ ఫిర్యాదు చేయడంతో వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రె డ్డి, బండి రాఘవరెడ్డి, గంగాధర్‌రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఎన్నికల సమయంలో ఇబ్బందులకు గురిచేసే వారందరిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. వారు ఏ పార్టీ అయినా చర్యలు తప్పవన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..

ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అరుదైన గుర్తింపు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 08 , 2025 | 12:56 PM