Share News

SP Ashok Kumar: పూర్తి భద్రత మధ్య పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు..

ABN , Publish Date - Aug 08 , 2025 | 01:27 PM

పులివెందుల, ఒంటి మిట్టలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు కట్టుదిట్ట భద్రత మధ్య నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. కడప పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

SP Ashok Kumar: పూర్తి భద్రత మధ్య పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు..

- ఇప్పటి వరకు 120 మందిపై కేసు నమోదు

- ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌

కడప: పులివెందుల, ఒంటి మిట్టలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు కట్టుదిట్ట భద్రత మధ్య నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్‌(SP EG Ashok Kumar) తెలిపారు. కడప పెన్నార్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పులివెందుల, ఒంటిమిట్ట(Pulivendula, Ontimitta)లో 12న ఎన్నికలు జరుగుతున్నాయని, 14న కౌంటింగ్‌ ఉంటుందన్నారు. ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామన్నారు.


అయినప్పటికీ రెండు సంఘటనలు జరిగాయి. సభ్యులు వారికి కేటాయించిన గ్రామాల్లో మాత్రమే ప్రచారం చేయాలన్నారు. అలాకాకుండా అనధికారికంగా వేరే గ్రామాలకు వెళ్లి ప్రచారం చేయడం సరికాదన్నారు. వేల్పుల గ్రామంలో నాగేంద్ర అనే వ్యక్తి వైసీపీ నుంచి టీడీపీ(TDP)కి రావడం జరిగిందని.. ఈ కమ్రంలో ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్‌, వేల్పుల రామలింగారెడ్డిలు నాగేంద్ర ఇంటికి వెళ్లిన సంద ర్భంలో ఇరువర్గాలు గొడవ పడి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం జరిగిందన్నారు.


ఎన్నికలకు సంబంధించి పులివెందుల, ఒంటిమిట్టలో ఇప్పటి వరకు 120 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశామని తెలిపారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని, లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మొబై ల్‌, పెట్రోలింగ్‌ పార్టీస్‌, స్లైకింగ్‌ ఫోర్సెస్‌తో భద్రత ఏర్పాటు చేయడం జరుగు తుందన్నారు. సుమారు 600 మందితో 12వ తేదీ ఎన్నికల సమయంలో భధ్రత కల్పిస్తున్నామన్నారు.


kadapa1.2.jpg

సీసీ కెమెరాలు, రిజర్వు ఫోర్స్‌ ఏర్పాటు చేస్తు న్నామన్నారు. డ్రోన్లద్వారా కూడా పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఎవరు కూడా హోటల్స్‌, లాడ్జిలలో ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గండికోటలో జరిగిన విద్యార్ధిని హత్యకు సంబంధించి మాట్లాడుతూ ఇంకా ఎవిడెన్స్‌ సేకరణ జరుగుతుందని టెక్నికల్‌గా పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..

ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అరుదైన గుర్తింపు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 08 , 2025 | 01:27 PM