Home » Prashant Kishor
సీతామర్హిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, ఇది జన్ సురాజ్ జన్మభూమి అని, మూడేన్నరేళ్ల క్రితం పార్టీ పుట్టిందని చెప్పారు. భయంతో బీజేపీకో, లాలూకో ఓటు వేయాల్సిన పనిలేదని, బిహార్‌లో రాజకీయ వెట్టిచాకిరీకి తాము ముగింపు పలకాలని తమ పార్టీ గట్టిగా తీర్మానించుకుందని తెలిపారు.
నామినేషన్లు వేసిన వారిని బెదిరించి వాటిని ఉపసంహరించుకోవడం ద్వారా పోటీ లేకుండా గెలవాలనే సూరత్ మోడల్‌ను బీజేపీ అమలు చేయాలనుకుంటోందని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు
నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్) 40 మంది ప్రముఖలతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను శుక్రవారం నాడు విడుదల చేసింది. నితీష్ కుమార్‌తో పాటు సీనియర్ నేతలు సంజయ్ కుమార్ ఝా, రాజీవ్ రంజన్ సింగ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.
జన్‌సురాజ్ పార్టీ ఇంతవరకూ 116 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీఎం నితీష్ కమార్ కంచుకోటగా భావించే హర్నాట్ నియోజకవర్గం నుంచి కమలేష్ పాశ్వాన్‌ను బరిలోకి దింపింది.
ఎన్నికల్లో పోటీచేసే 116 మంది అభ్యర్థులను ఇంతవరకూ ప్రకటించామని, త్వరలోనే తక్కిన అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు గట్టి పట్టున్న రఘోపూర్ నుంచి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాహుల్ గాంధీ ఎలాగైతే అమేథీలో ఓడిపోయారో అలాగే తేజస్విని సొంత నియోజకవర్గంలోనే ఓడిస్తామని కిశోర్ తెలిపారు.
రఘోపూర్ నుంచి గెలిచే లాలూ, రబ్రీ ముఖ్యమంత్రి పదవులు చేపట్టారనీ, తేజస్వి కూడా రఘోపూర్ నుంచి రెండు సార్లు గెలిచారని, బిహార్ ఉప ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.
జనతాదళ్(యునైటెడ్) చీఫ్ అయిన 74 ఏళ్ల నితీష్ కుమార్ గత రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసి 'సుశాసన్ బాబు'గా ఆయన పేరు తెచ్చుకున్నారు.
పార్టీ అకౌంట్స్‌కు చెందిన పేమెంట్లన్నీ చెక్కుల్లోనే ఉంటాయని, తప్పులకు అవకాశమే లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఇతర మార్గాల ద్వారా కూడా తమ పార్టీకి డొనేషన్లు వచ్చాయని తెలిపారు.
బిహార్‌లో శాంతి భద్రతల పరిస్థితి తీవ్రంగా క్షీణించిందని, ప్రభుత్వానికి తాము మద్దతిస్తున్నందుకు విచారిస్తున్నామని ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై పాశ్వాన్ శనివారంనాడు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో పప్పు యాదవ్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు.