Share News

Bihar Elections: తేజస్విపై అభ్యర్థిని ప్రకటించిన జన్‌సురాజ్ పార్టీ

ABN , Publish Date - Oct 14 , 2025 | 09:15 PM

జన్‌సురాజ్ పార్టీ ఇంతవరకూ 116 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీఎం నితీష్ కమార్ కంచుకోటగా భావించే హర్నాట్ నియోజకవర్గం నుంచి కమలేష్ పాశ్వాన్‌ను బరిలోకి దింపింది.

Bihar Elections: తేజస్విపై అభ్యర్థిని ప్రకటించిన జన్‌సురాజ్ పార్టీ
Chanchal singh contest against Tejaswi Yadav in Raghopur

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly Elections) రఘోపూర్ (Raghopur) నియోజకవర్గం నుంచి పోటీకి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) సిద్ధమవుతుండగా.. ఆయనకు పోటీగా ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని 'జన్ సురాజ్' (Jan Suraaj) పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈ నియోజకవర్గం నుంచి ప్రశాంత్ కిషోర్ స్వయంగా పోటీ చేస్తాయని ప్రచారం జరిగినప్పటికీ ఆ సస్పెన్స్‌కు పార్టీ తెరదింపింది. రఘోపూర్ నుంచి చంచల్ సింహ్ (Chanchal Singh)ను తమ అభ్యర్థిగా మంగళవారంనాడు ప్రకటించింది.


జన్‌సురాజ్ పార్టీ 65 మంది అభ్యర్థులతో రెండవ జాబితాను సోమవారంనాడు ప్రకటించింది. రఘోపుర్ నియోజకవర్గం అభ్యర్థిని మాత్రం సస్పెన్స్‌లో ఉంచింది. దీంతో ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా రఘోపూర్ అభ్యర్థిగా చంచల్ సింహ్‌ పేరును తాజాగా ప్రకటించింది.


జన్‌సురాజ్ పార్టీ ఇంతవరకూ 116 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీఎం నితీష్ కమార్ కంచుకోటగా భావించే హర్నాట్ నియోజకవర్గం నుంచి కమలేష్ పాశ్వాన్‌ను బరిలోకి దింపింది. బిహార్‌లో మార్పు జన్‌సురాజ్‌తోనే సాధ్యమనీ, గణనీయమైన ఫలితాలను తమ పార్టీ సాధించనుందని ప్రశాంత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

సీట్ల పంపకాల్లో జాప్యం.. ప్రకటించిన జాబితాను వెనక్కి తీసుకున్న సీపీఐఎంఎల్

ఒకే విడతలో అభ్యర్థులను ప్రకటించిన హెచ్ఏఎం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 14 , 2025 | 09:15 PM