Share News

Bihar Elections: సీట్ల పంపకాల్లో జాప్యం.. ప్రకటించిన జాబితాను వెనక్కి తీసుకున్న సీపీఐఎంఎల్

ABN , Publish Date - Oct 14 , 2025 | 08:28 PM

సీట్ల పంపకాలపై విపక్ష మహాకూటమిలో అనిశ్చితి కొనసాగుతోంది. మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చర్చలు ఇంకా కొనసాగుతుండటంతో అధికారిక ప్రకటనలో జాప్యం చోటుచేసుకుంది.

Bihar Elections: సీట్ల పంపకాల్లో జాప్యం.. ప్రకటించిన జాబితాను వెనక్కి తీసుకున్న సీపీఐఎంఎల్
Bihar Assembly Elections

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) సంబంధించి ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే 18 మంది అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ప్రకటించిన సీపీఐ (ఎంఎల్) తాజాగా ఆ జాబితాను ఉపసంహరించుకుంది. కొన్ని సీట్లకు సంబంధించి కూటమి భాగస్వాముల మధ్య చర్చలు కొనసాగుతున్నందున ముందుగా ప్రకటించిన జాబితాను ఉపసంహరించుకుంటున్నామని, సవరించిన జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు.


సీట్ల పంపకాలపై అనిశ్చితి

కాగా, సీట్ల పంపకాలపై విపక్ష మహాకూటమిలో అనిశ్చితి కొనసాగుతోంది. మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చర్చలు ఇంకా కొనసాగుతుండటంతో అధికారిక ప్రకటనలో జాప్యం జరుగుతున్నట్టు చెబుతున్నారు.


ఎన్డీయే ముందంజ

ఎన్డీయే కూటమి ఇప్పటికే సీట్ల పంపకాలపై అధికార ప్రకటన చేయడంతో పాటు అభ్యర్థుల జాబితాలను కూడా ప్రకటిస్తోంది. బీజేపీ 71 మంది అభ్యర్థుల జాబితాను, హిందుస్థాన్ అవామ్ మోర్చా మొత్తం 6 అభ్యర్థుల జాబితాను మంగళవారంనాడు ప్రకటించాయి. బిహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

ఒకే విడతలో అభ్యర్థులను ప్రకటించిన హెచ్ఏఎం

71 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 14 , 2025 | 08:29 PM